Reading Time: < 1 minute

ఛండీగఢ్: హర్యానాలో నిర్భయ తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఫరీదాబాద్‌లో లిఫ్ట్ అడిగిన యువతిని వ్యానులో ఎక్కించుకొని ఆమెపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసి రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. సదరు యువతి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఇంట్లో ఓ యువతి తన తల్లితో గొడవ పెట్టుకొని స్నేహితురాలు ఇంటికి వెళ్లింది. స్నేహితురాలి ఇంటి నుంచి తన ఇంటికి వస్తుండగా ఆటో దొరక్కపోవడంతో వ్యాన్ ఎక్కింది. కళ్యాణ్‌పూర్ ప్రాంతంలో దిగబెట్టకుండా గురుగ్రామ్ వెళ్లే దారులో వ్యాన్ తీసుకెళ్లారు. అనంతరం మూడు గంటల పాటు ఇద్దరు యువకులు ఒకరు తరువాత ఒకరు తనపై అత్యాచారం చేశారు. తన చంపేస్తానని బెదిరించారు. అనంతరం మూడు గంటల సమయంలో వేగంగా వెళ్తున్న వ్యాను నుంచి బయటకు నెట్టేశారు. మూడున్నర తన సోదరి నుంచి ఫోన్ కాల్ రావడంతో లిప్ట్ చేసింది. ఫోన్ కాల్ వెంటనే కట్ అయ్యింది. మళ్లీ ఫోన్ చేసినప్పటి మాట్లాడలేని స్థితిలో ఉండడంతో ఏడుస్తూ మాట్లాడడంతో వెంటనే ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని ఆమె జాడను కనిపెట్టారు. ముఖంపై గాయాలు కావడంతో వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో ఢిల్లీకి తరలించాలని వైద్యులు సూచించారు. వెంటనే ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించామని సోదరి ఏడుస్తూ మీడియాకు తెలిపింది. పోలీసులు బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులలో ఒకరిది మధ్యప్రదేశ్‌లోని ఝాన్సీ, మరొకరిది ఉత్తర ప్రదేశ్‌లోని మథురగా గుర్తించారు.