
వీధికుక్కలు దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వీధి కుక్కలు విడిచిపెట్టడం లేదు. ఒంటరిగా కనిపిస్తే చాలు కుక్కలన్నీ ఒక్కటై ఎగబడి పీక్కుతింటున్నాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం చర్యలు తీసుకున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదు అన్ని స్థానికులు స్థానికులు అంటున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని హైదర్ షాకోట్లో కుక్కలు వీరంగం సృష్టించాయి. నాలుగేళ్ల బాలుడిని చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడి చేశాయి. వివరాల ప్రకారం హైదర్షి కోట్ శాంతినగర్ కాలనీకి చెందిన వేదాంత్ రెడ్డి(4) ఇంటి బయట ఆడుకుంటుండగా నాలుగు వీధికుక్కలు బాలుడిని చుట్టుముట్టాయి. చిన్నారిని విచక్షణారహితంగా కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో స్థానికులు గమనించి కుక్కలను చెదరగొట్టారు. గాయాలకు గురైన చిన్నారిని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కుక్కల విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతున్నారు.
చుట్టుముట్టాయి. చిన్నారిని విచక్షణారహితంగా కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో స్థానికులు గమనించి కుక్కలను చెదరగొట్టారు. గాయాలకు గురైన చిన్నారిని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కుక్కల విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతున్నారు. అయితే ఇదే ప్రాంతంలో గతంలోనూ కుక్కల దాడుల ఘటనలు జరిగాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల నియంత్రణలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని హిమగిరి కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని, చిన్నారుల భద్రతకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి కుక్కల సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి