Reading Time: < 1 minute

 గుట్టుచప్పుడు కాకుండా మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరిని ఎస్‌ఓటీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో కొకైన్ ఉందని విశ్వసనీయ సమాచారం అందడంతో ఎస్‌ఓటీ పోలీసులు శ్రీనివాస్, విజయ్ ను పట్టుకున్నారు. ఎపిలోని రాజమండ్రికి చెందిన వ్యక్తి శ్రీనివాస్(46) గోవాకు చెందిన విజయ్ వ్యక్తులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారి వద్ద నుంచి ఏడు గ్రాముల కొకైన్ డ్రగ్ తో పాటు రెండు సెల్ పోన్లు సీజ్ చేసి నార్సింగి పోలీసులకు అప్పగించారు. శ్రీనివాస్ ను హాస్పిటల్ కు తరలించి టెస్ట్ చేయడంతో పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే ఈ డ్రగ్స్ వ్యవహారం ఎప్పటి నుంచి నడుస్తుందో, ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరే ఉన్నారా, మరెవరైనా ఈ కుట్రలో భాగస్వాములుగా ఉన్నారా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించార

చిన్నారిపై విధి కుక్కల దాడి