
బెర్న్: స్విట్జర్లాండ్ లో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. గురువారం తెల్లవారుజామున సియెర్ జిల్లాలోని క్రాన్స్-మొంటానా అనే స్కీ రిసార్ట్ పట్టణంలో జరిగిన ఘోర పేలుడులో పలువురు మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం.. విలాసవంతమైన ఆల్పైన్ స్కీ రిసార్ట్‌లోని బార్‌లో నూతన సంవత్సర వేడుకల్లో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది.
బార్‌లో స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1.30 గంటలకు పేలుడు సంభవించిందని స్విట్జర్లాండ్ పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారని, గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. బాధితుల కోసం అధికారులు సహాయక కేంద్రాన్ని, హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ఇక, పేలుడుకు కారణమేమిటో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని అధికారి తెలిపారు.