
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఈగల్ టీమ్ దాడులు చేసింది. గురువారం హైదరాబాద్‌లోని పలు పబ్ లల్లో కొత్త సంవత్సరం వేడులక ముసుగులో గంజాయి, డ్రగ్స్ సరఫరా జరగుతున్నట్లు సమాచారం అందడంతో ఈగల్ టీమ్ సోదాలు నిర్వహించింది. బఫెలో వైల్డ్ వింగ్స్, షెర్లాక్, ఇల్యూషన్, వేవ్ పబ్‌లలో ఆకస్మిక తనిఖీలు చేసిన ఈగల్ టీమ్ ఐదుగురు డీజేలను అరెస్ట్ చేసింది. డ్రగ్స్ తీసుకొని డీజే ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.