
ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. పెబ్బేరుకు చెందిన ప్రకాశ్ కుటుంబంతో కల్వకుర్తిలో నివాసముంటున్నాడు. దగ్గరలో ఓ దుకాణంలో పనిచేసేవాడు. 2025 నవంబర్ నెలలో ప్రకాశ్ గుండెపోటుతో మరణించాడు. భర్త మృతిని తట్టుకోలేక మనస్థాపానికి గురైన ప్రసన్న(40), కూతురు(13), కొడుకు (15) అన్నంలో పురుగుల మందు కలిపి తినిపించి,తాను తిని ఆత్మహత్యకు యత్నించింది.అది గమనించిన స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కూతురు మృతి చెందింది.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు తల్లికొడుకు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో తల్లి మరణించింది. ప్రస్తుతం కొడుకు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.