Reading Time: < 1 minute

జర్నలిస్టుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని, తన పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని పరిష్కరిస్తానని సిఎం రేవంత్‌రెడ్డి భరోసానిచ్చారు. గురువారం రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియూడబ్లూజే) ప్రతినిధి బృందం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. అదేవిధంగా యూనియన్ రూపొందించిన 2026 మీడియా డైరీని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరింప చేయించింది. ఈ సందర్భంగా జర్నలిస్టులకు నూతన సంవత్సర కానుకగా సంక్షేమ పథకాలు అందించాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ సిఎం రేవంత్‌ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.

సిఎంను కలిసిన వారిలో ఐజేయూ మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, టియూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కె.సత్యనారాయణ, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, కార్యదర్శులు వి.యాదగిరి, కె.శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి ఎం.వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.కిరణ్ కుమార్, అజిత, చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు, ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.ఎన్.హరి, ఉర్దూ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి గౌస్ మెయియుద్దీన్, వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరీష్ ఉన్నారు. అనంతరం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని యూనియన్ ప్రతినిధి బృందం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది.