Reading Time: < 1 minute

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీం పట్నం గురునానక్ కాలేజీలో విషాదం చోటు చేసుకుంది. కాలేజీ హాస్టల్ లో ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గురునానక్ కాలేజీలో బిటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..కేసు నమోదు చేసుకుని ఫిర్యాదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు రాము (20)గా పోలీసులు గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.