Reading Time: < 1 minute

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలో వైసిపి జడ్ పిటిసి బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ప్రతాప్ రెడ్డి తలపై కర్రలు, రాడ్లతో టిడిపి కార్యకర్తలు దాడి చేశారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న వైసిపి నేతలపై టిడిపి నేతలు దాడి చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వస్తున్నాయి. టిడిపి నేతల దాడికి నిర‌స‌న‌గా వైసిపి నేత‌ల ధ‌ర్నా చేపట్టారు. ధర్నా చేస్తున్న వారిపై కూడా టిడిపి నేతలు దాడి చేశారు. బోగాతి ప్రతాప్ రెడ్డి సహా నలుగురికి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో వైసిపి కార్యకర్తలు, ప్రతాప్ రెడ్డి యల్లనూరు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.