
అమరావతి: విద్యుత్ రంగంపై ఎపి సిఎం చంద్రబాబునాయుడుకు అపార అనుభవం ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపం అని అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. దూరదృష్టితోనే ప్రజలపై భారం పడకుండా చూశారని, మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి చేసిన విద్యుత్ పాపాలు నేటికి వెంటాడుతున్నాయని విమర్శించారు. వైసిపి ఐదేళ్ల విద్యుత్ విధ్వంస భారాన్ని, యూనిట్ విద్యుత్ కు 13 పైసలు తగ్గించి చరిత్ర సృష్టించామని తెలియజేశారు. గత వైసిపి ప్రభుత్వం ప్రజలపై..రూ.32, 166 కోట్ల భారం ట్రూఆప్ భారం మోపిందని, భవిష్యత్ లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గించేలా ప్రణాళికలు చేస్తున్నామని గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.