Reading Time: < 1 minute

హైదరాబాద్: భారత్, శ్రీలంక వేదికగా టి20 వరల్డ్ కప్ జరుగనుంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇప్పటికే బిసిసిఐ టీమిండియా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా కూడా తన టీమ్‌ను 15 సభ్యులతో ప్రకటించింది. కమిన్స్ గాయపడడంతో యాషెస్ టెస్టు సిరీస్‌లో మూడో టెస్టులో మాత్రమే ఆడాడు. తీవ్ర గాయాలతో కమిన్స్, హేజిల్‌వుడ్, డేవిడ్‌లు ఇబ్బంది పడుతున్నారని సెలక్టర్ల ఛైర్మన్ జార్జ్ బెయిలీ తెలిపాడు. ముగ్గురు టి20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరిగే సమయానికి ఫిట్ ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. బిగ్‌బాష్ లీగ్‌లో డేవిడ్ గ్రేడ్ గాయపడిన విషయం విధితమే. హేజిల్‌వుడ్ చీలమండల నొప్పితో యాషెస్ సిరీస్‌లో ఆడలేదు.

ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్(కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కూపర్ కానెల్లీ, జోష్ ఇంగ్లిస్, కామెరూన్ గ్రీన్, హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, నాథన్ ఎల్లిస్, మ్యాథ్యూకుహ్నెమన్, ఆడమ జంపా, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మ్యాథ్యూ షార్ట్