Reading Time: < 1 minute

హైదరాబాద్: విజయ్ హజారే ట్రోఫీలో గోవా జట్టుపై ముంబయి జట్టు గెలిచింది. ముంబయి తొలుత బ్యాటింగ్ చేసి గోవా జట్టు ముందు 445 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. గోవా జట్టు 357 పరుగులు చేయడంతో 87 పరుగుల పరుగులతో ఘోర ఓటమిని చవిచూస్తుంది. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్‌లో విరవిహారం చేశాడు. 75 బంతుల్లో 157 పరుగులు చేసి సెలక్టర్లకు సంకేతాలు పంపించాడు. సర్ఫరాజ్ సూపర్ సెంచరీ చేయడంతో క్రికెట్ పండితులు ప్రశంసిస్తున్నారు. ముషీర్ ఖాన్ తమ్ముడు కూడా 66 బంతుల్లో 60 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. తాను క్రీజులోకి వచ్చేసరికి ఓపెనర్లు ఇద్దరు ఆచితూచి ఆడారని సర్ఫరాజ్ ఖాన్ తెలిపారు. తాను బ్యాటింగ్ దిగే సమయానికి రన్‌రేట్ పెద్దగా లేదన్నారు. తాను క్రీజులోకి వచ్చిన తరువాత పిచ్‌ను బాగా పరిశీలించానని, బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిన తరువాత బ్యాట్‌ను ఝుళిపించానని వివరణ ఇచ్చాడు. ఎక్కువ పరుగులు చేసి ప్రత్యర్థి జట్టుకు ఎక్కువ టార్గెట్ ఇవ్వాలనుకున్నానని, అందుకే ధాటిగా బ్యాటింగ్ చేశానని చెప్పుకొచ్చాడు. తాను క్రీజులోకి వచ్చేసరికి ముషీర్‌ఖాన్ అప్పటికే హాఫ్ సెంచరీకి చెరువలో ఉన్నాడని తెలియజేశారు. ముషీర్‌ఖాన్ సెంచరీ చేయకపోవడం అనేది కొంచెం బాధను కలిగించిందని, ఇద్దరు ఒకే మ్యాచ్‌లో సెంచరీ చేయాలనేది తమ కోరిక అని తెలిపారు. రంజీ ట్రోఫీలో ఇద్దరు హాఫ్ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.