Reading Time: < 1 minute

హైదరాబాద్: నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తుడుముల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ముగ్గురు పిల్లలకు విషయం కలిపిన పాలు తాగించి చంపాడు. అనంతరం తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సురేంద్ర భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అనారోగ్యంతో గతేడాది ఆగస్టు 16న సురేంద్ర భార్య మహేశ్వరి (32) ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు వేములపాటి సురేంద్ర(35), కావ్యశ్రీ(7), ధ్యానేశ్వరి(4), సూర్య గగన్(2)గా పోలీసులు గుర్తించారు. పిల్లలను పెంచలేక దారుణానికి పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారని పోలీసులు తెలిపారు.