Reading Time: < 1 minute

అమరావతి: ప్రేమ పెళ్లి చేసుకున్నాడని యువకుడిని యువతి బంధువులు చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కానుకొల్లు గ్రామంలో కందుల సాయిదుర్గ అనే యువకుడు రమణక్కపేటలో పోస్టు ఆఫీస్‌లో పని చేస్తుంది. మండవల్లి గ్రామానికి చెందిన పల్ల సాయిచంద్ పరిచయం కావడంతో ప్రేమగా మారింది. గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ పెళ్లి చేసుకుంటామని ఇద్దరు కుటుంబ సభ్యులకు తెలపడంతో యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. పెద్దలకు తెలియకుండా ఇద్దరు గంగానమ్మ ఆలయంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

తమకు ప్రాణహాని ఉందని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరు కుటుంబాల సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రేమ జంటపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రేమ వివాహం చేసుకున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. వెంటనే యువతి కుటుంబ సభ్యులు రమణక్క పేటకు చేరుకొని యువకుడిని స్తంభానికి కట్టేసి దాడి చేశారు. పోస్టుఫీసులో పోస్టు ఉమెన్‌గా పని చేస్తున్న చెన్నకేశ్వరిపై కూడా దాడి చేశారు. ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు.