Reading Time: < 1 minute

అమరావతి: కూటమి ప్రభుత్వం ఎన్నో మైలురాళ్లకు చేరుకుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అనేక పథకాలు, కార్యక్రమాలకు 2025 నాంది పలికిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2025లో మా ప్రభుత్వం మరచిపోలేని విజయాలు అందించిందని, విధ్వంసం నుంచి వికాసం వైపు ఎపిని నడిపించిన గొప్ప మలుపు ఇది అని సిఎం పేర్కొన్నారు. 2026.. అందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని కోరుకుంటున్నానని, ఈ ఏడాది మరింత సంతోషం కలిగించేందుకు కృషి చేస్తానని మాటిస్తున్నానని అన్నారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఎపి లక్ష్యాల సాధనకు 2026లో మరిన్ని అడుగులు పడాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.