Reading Time: < 1 minute

నల్లగొండ: పోలీసులు వేధిస్తున్నారంటూ రైతు ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్పడిన సంఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎర్రగడ్డలగూడెంలో జరిగింది. భూవివాదంలో పోలీసులు వేధిస్తున్నారంటూ దామోదర్ రెడ్డి అనే రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. నాలుగు గుంటల భూమి విషయంలో దామోదర్ రెడ్డికి మరో వ్యక్తితో గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. పోలీసులు దామోదర్ రెడ్డిని  వేధిస్తుండడంతో కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.