చాలామందికి వయసు పెరిగే కొద్దీ నోటి చివర్లో ‘జ్ఞానదంతం’ (విజ్డమ్ టూత్) వస్తుంటుంది. అయితే, ఈ పన్నును గనక డాక్టర్ దగ్గరకు వెళ్లి పీకించేస్తే కంటి చూపు తగ్గిపోతుందనే ఒక పెద్ద అపోహ మన సమాజంలో ప్రచారంలో ఉంది. అసలు ఈ మాటల్లో ఎంతవరకు నిజం ఉంది? జ్ఞానదంతానికి, మన కంటి చూపుకు ఏమైనా సంబంధం ఉందా లేదా అనే ఆసక్తికరమైన విషయాలను, సైన్స్ ఏం చెబుతుందో సులభంగా తెలుసుకుందాం..
అసలు జ్ఞానదంతం అంటే ఏమిటి?: మన నోటి వరసలో అందరికంటే చివర్లో మొలిచే పళ్లనే జ్ఞానదంతాలు అంటారు. ఇవి సాధారణంగా మనిషికి 17 ఏళ్ల నుండి 25 ఏళ్ల వయసు వచ్చేటప్పుడు బయటకు వస్తాయి. ఇవి చిగుళ్ల లోపల లేదా దవడ ఎముకలో గట్టిగా కూరుకుపోయి ఉంటాయి.
సైన్స్ ఏం చెబుతోంది?: శాస్త్రవేత్తలు, డాక్టర్ల పరిశోధనల ప్రకారం.. జ్ఞానదంతాలు అనేవి మన శరీరంలో పెద్దగా ఉపయోగపడని అనవసర అవయవాలు పూర్వకాలంలో మనుషులు పచ్చి మాంసం, గట్టి పదార్ధాలు తినడానికి ఇవి ఉపయోగపడేవి. కానీ, ఇప్పుడు మనం వండుకుని తింటున్నాం కాబట్టి వీటి అవసరం మనకు లేదు..నార్మల్గా అందరికి వుండవలిసిన పళ్ళు ఉంటే సరిపోతుంది.
చూపు తగ్గుతుందనేది నిజమేనా?: ఖచ్చితంగా అబద్ధం! దంతాలను తొలగించడం వల్ల కంటి చూపు మందగిస్తుందనే నమ్మకంలో ఎలాంటి నిజం లేదు. ఎందుకంటే, మన కళ్లను నియంత్రించే నరాలు వేరుగా ఉంటాయి, అలాగే మన దవడలోని పళ్లకు సంబంధించిన నరాలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఒకదానిపై ఇంకొకదానికి ప్రభావం ఉండదు.

పీకేయడం సురక్షితమేనా?: ఈ జ్ఞానదంతాలు సరిగ్గా రానప్పుడు పక్క పళ్లను నొక్కుతూ విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. అలాంటప్పుడు డెంటిస్ట్ దగ్గరకు వెళ్లి ఆ పన్నును తీయించేసుకోవడమే మంచిది.ఇక ఈ చికిత్సలు పూర్తిగా సురక్షితమైనవి. దీనివల్ల మీ కళ్లకు ఎలాంటి ప్రమాదం గానీ, చూపు తగ్గడం గానీ జరగదు.
భయపడాల్సిన అవసరం అస్సలు లేదు! జ్ఞానదంతం నొప్పి పెడుతుంటే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవడమే తెలివైన పని. పుకార్లను నమ్మి అనవసరంగా బాధను భరించడం కంటే, సరైన సమాచారంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం.
గమనిక: పంటి నొప్పులు ఉన్నప్పుడు సొంత వైద్యాలు చేసుకోకుండా ఎప్పుడైనా సరే క్వాలిఫైడ్ డెంటిస్ట్‌ను (దంత వైద్యుడిని) కలిసి వారి సలహా మేరకే ట్రీట్‌మెంట్ తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది.
The post జ్ఞానదంతం తొలగింపు వల్ల చూపుపై ప్రభావం ఉందా? appeared first on Manalokam – Latest Telugu News & Updates.