
జూబ్లీహిల్స్, వెలుగు: ఆర్థోపెడిక్ డాక్టర్లు ఎ.వి.గురువా రెడ్డి, కె.సుధీర్ రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అమీర్‌పేట్‌కు చెందిన డాక్టర్ సుధీర్ దారా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్36లో ఎపియోన్ పెయిన్ మేనేజ్‌మెంట్ క్లినిక్నిర్వహిస్తున్నారు. ౌ
అయితే, డాక్టర్ గురువా రెడ్డి, డాక్టర్ సుధీర్ రెడ్డి తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని శుక్రవారం ఫిర్యాదు చేశారు. అలాగే, తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్నారు. తన కులాన్ని లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.