
హైదరాబాద్: రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు బీజేపీ పెద్ద కుట్ర పన్నిందన్నారు ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్. నా అభ్యర్థిత్వాన్ని అడ్డుకునేందుకు బీజేపీ ప్లాన్ చేసింది.. RO అధికారి, ఎన్నికల అధికారుల కుమ్మక్కయ్యారు. గతంలో హర్యానాలో కూడా ఇదే జరిగింది. నాపై క్రిమినల్ కేసులు లేవు.. కేవలం నోటీసులు మాత్రమే వచ్చిందని స్పష్టం చేశారు. ఖచ్చితంగా బీజేపీ సీట్ చోరీకి పాల్పడుతోందని విమర్శించారు.
మధ్యప్రదేశ్ లో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి.. బీజేపీ రెండు సీట్లు గెలిచే కోరం ఉంది.. అయితే దురుద్దేశంతోనే మూడోఅభ్యర్థిని బీజేపీ గెలిపించుకుందని అన్నారామె. కాంగ్రెస్ ఓ రాజ్యసభ దక్కించుకునేందుకు మెజార్టీ ఉన్నది.. నా అభ్యర్థిత్వాన్ని బీజేపీ కావాలనే అడ్డుకుందని అన్నారు మీనాక్షీ నటరాజన్.
ఇటువంటి ఆరోపణలతోనే గతంలో శివాకుమార్ రెడ్డి టికెట్ ఇవ్వొదని పార్టీ నిర్ణయం తీసుకుంది. శివకుమార్ పై ఇప్పటికీ కేసు ప్రూవ్ కాలేదు.. నామినేషన్ తిరస్కరణ అంశాన్ని బీజేపీ క్యాష్ చేసుకుందన్నారు మీనాక్షి నటరాజన్. బీజేపీ ఆరోపణలు అన్నీ బేస్ లెస్.. ఫేక్ ప్రచారం చేశారు. పార్టీలో మేమంతా కలిసికట్టుగా పనిచేస్తున్నాం..మేం అసంతృప్తిగా లేమని చెప్పారు.
గత రెండేళ్లుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై పోరాటం చేస్తున్నారు.. రాజ్యాంగాన్ని బీజేపీ ఖూని చేయడంపై రాహుల్ గాంధీ గళమెత్తారు. ఎన్నికల కమిషన్, రిటర్నంగ్ అధికారులు కుమ్మక్కై తప్పుడు ఆరోపణలపై RO నామినేషన్ తిరస్కరణ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మీనాక్షీ నటరాజన్.
పొలిటికల్ లీడర్లకు నోటీసులుకామన్.. నోటీసులోని సారాంశాన్ని అర్థం చేసుకోకుండా.. RO తప్పుడు నిర్ణయంతో నామినేషన్ రద్దు చేసిందన్నారు. రిటర్నింగ్ ఆఫీస్ రూంలో బీజేపీ నేతలు కూర్చొని దౌర్జన్యాలకు దిగారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ స్థానిక నేతలపై బెదిరింపులకు పాల్పడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలను లోపలికి రాకుండా అడ్డుకున్నారని మీనాక్షీ నటరాజన్ విమర్శించారు. బీజేపీ కుట్ర వల్లే తన నామినేషన్ తిరస్కరణకు గురైంది.. కాంగ్రెస్ పార్టీ నేతలమంతా కలిసి కట్టుగానే ఉన్నామని మీనాక్షీ నటరాజన్ స్పష్టం చేశారు.