Reading Time: < 1 minute

ఇసుక లారీని ఢీకొన్న కారు..ముగ్గురు మృతి

Caption of Image.

మేడ్చల్, వెలుగు: హైదరాబాద్ – కరీంనగర్ రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మల్కాజ్‌‌‌‌గిరికి చెందిన రైల్వే ఉద్యోగి చంద్రశేఖర్(35), అతని భార్య రేఖ(30), కొడుకు లోహిత్ (7), రేఖ వాళ్ల అక్క కొడుకు నిహాల్ (2)తో కలిసి గోదావరిఖని నుంచి హైదరాబాద్‌‌‌‌కు బయలుదేరారు. చంద్రశేఖర్ నడుపుతున్న కారు గురువారం తెల్లవారుజామున మేడ్చల్ జిల్లా తుర్కపల్లి మురహరిపల్లి గ్రామం సమీపంలో ప్రమాదానికి గురైంది.

కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఇసుక లారీని ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది.ఈ  ప్రమాదంలో చంద్రశేఖర్ స్పాట్​లోనే మృతి చెందగా, రేఖ, లోహిత్, నిహాల్‌‌‌‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెనకాలే మరో కారులో వస్తున్న చంద్రశేఖర్ బావమరిది రాజశేఖర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా రేఖ,  నిహాల్ మృతి చెందినట్లు నిర్ధారించారు. 

©️ VIL Media Pvt Ltd.