Reading Time: 2 minutes

మళ్లీ దంచుతున్న ఎండలు …10 జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు

Caption of Image.
  • మళ్లీ దంచుతున్న ఎండలు
  • 10 జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు
  • 194 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు
  • ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధిక ప్రభావం
  • హైదరాబాద్​లోనూ 9 మండలాల్లో హీట్​వేవ్స్​ 
  • రేపటి నుంచి మూడు రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్​

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రత ఎక్కువైంది. దక్షిణాది జిల్లాల్లోకి ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా.. మరింత విస్తరించకపోవడం, వాతావరణం చల్లబడేందుకు సరైన వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో జూన్​ చివరి వారానికొచ్చినా హీట్​వేవ్స్​ ప్రభావం తగ్గడం లేదు. శనివారం 194 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండడమే ఇందుకు నిదర్శనం. మరో 96 మండరాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రత ఎక్కువైంది. దక్షిణాది జిల్లాల్లోకి ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా.. మరింత విస్తరించకపోవడం, వాతావరణం చల్లబడేందుకు సరైన వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో జూన్​ చివరి వారానికొచ్చినా హీట్​వేవ్స్​ ప్రభావం తగ్గడం లేదు. శనివారం 194 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండడమే ఇందుకు నిదర్శనం. మరో 96 మంలాల్లోనూ వడగాడ్పులు వీయడంతో మొత్తంగా 290 మండలాల్లో ఎండ మంటతో జనం అల్లాడారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు తెలంగాణ  డెవలప్​మెంట్​ ప్లానింగ్​ సొసైటీ (టీజీడీపీఎస్) డేటా వెల్లడించింది. అత్యధికంగా నిజామాబాద్​ జిల్లాలోని 24 మండలాల్లో ‘సివియర్​ హీట్​వేవ్స్​’ నమోదయ్యాయి. 

సిద్దిపేట జిల్లాలోని 14 మండలాలు, పెద్దపల్లి జిల్లాలోని 13, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో 12 చొప్పున మండలాలు, కామారెడ్డి, నిర్మల్​ జిల్లాల్లో 11 చొప్పున మండలాలు, ఆసిఫాబాద్​ జిల్లాలోని 10 మండలాల్లో సివియర్​ హీట్​వేవ్స్​ రికార్డయ్యాయి. ఆదిలాబాద్​లో 9, హనుమకొండలో 8, మెదక్​లో 8, సిరిసిల్లలో 8, సూర్యాపేటలోని ఆరు మండలాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీచాయి. ఇటు హైదరాబాద్​ సిటీలోనూ వడగాడ్పులు దారుణంగా ఉన్నాయి. హైదరాబాద్​ పరిధిలోని 4 మండలాల్లో సాధారణ, 5 మండలాల్లో సివియర్​ హీట్​వేవ్స్​ పరిస్థితులున్నాయని టీజీడీపీఎస్​ డేటా స్పష్టం చేసింది. అయితే, పొద్దంతా ఎండకొట్టినా సాయంత్రం సమయంలో మాత్రం ఉన్నట్టుండి వర్షాలు పడుతున్నాయి.

44 డిగ్రీలకు చేరువలో టెంపరేచర్లు

జూన్​ రెండో వారం దాటితే ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గిపోతాయి. నిరుడు ఈ పాటికి అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలలోపే టెంపరేచర్లు నమోదయ్యాయి. నిరుడు ఇదే టైమ్​కు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలే కావడం గమనార్హం. కానీ, ఈ ఏడాది మాత్రం ఉపశమనం కనిపించడం లేదు. 43 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 44 డిగ్రీలకు చేరువలో రికార్డవుతున్నాయి.  26 జిల్లాల్లో టెంపరేచర్లు ఆరెంజ్​ జోన్​లోనే నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 10 జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగానే టెంపరేచర్లు నమోదయ్యాయి. శనివారం అత్యధికంగా ఆదిలాబాద్​లో 43.5 డిగ్రీల టెంపరేచర్​ నమోదైంది. జగిత్యాల జిల్లా పూడూరు, మంచిర్యాల జిల్లా వెల్గనూరు, పెద్దపల్లి జిల్లా ఎలిగేడులలో 43.4 డిగ్రీలు, ఆసిఫాబాద్​ జిల్లా బెజ్జూరు, మెదక్​ జిల్లా కాగజ్​మద్దూరులో 43.3, కరీంనగర్​ జిలా వెదురుగట్టులో 43.2, నిర్మల్​ జిల్లా నర్సాపూర్​లో 43.1, నిజామాబాద్​ జిల్లా బాల్కొండలో 43.1, సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 7 జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా, ఆరు జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్​లోనూ ఉష్ణోగ్రతలు మళ్లీ 40 డిగ్రీల మార్క్​ను దాటుతున్నాయి. వారం రోజులుగా 40 లోపే నమోదైనా.. మళ్లీ ఇప్పుడు పెరుగుతున్నాయి. అత్యధికంగా కొంపల్లి, నిజాంపేట్​లో 40.9 డిగ్రీల టెంపరేచర్​ నమోదైంది. మేడ్చల్​లో 40.7, కీసరలో 40.7, దుండిగల్​లో 40.6, నార్సింగిలో 40.5, చింతల్, ముషీరాబాద్, తార్నాక, యూసుఫ్​గూడ, ఖైరతాబాద్, ఉప్పల్​లలో 40.4 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. 

©️ VIL Media Pvt Ltd.