Reading Time: < 1 minute

కస్టమర్లకు అమెజాన్ గుడ్ న్యూస్.. రూ.1000కి తగ్గిన ప్రైమ్ మెంబర్షిప్..జూలై 4 నుంచి ప్రైమ్డే సేల్

Caption of Image.

న్యూఢిల్లీ: అమెజాన్ ప్రైమ్ డే పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా  ప్రైమ్ సభ్వత్వం ధరను రూ.1,500 నుంచి రూ.వెయ్యికి తగ్గించారు. అంతేగాక వచ్చే నెల 4–6 తేదీల్లో ప్రత్యేక సేల్ నిర్వహిస్తారు. 72 రెండు గంటల పాటు జరిగే ఈ సేల్‌‌‌‌‌‌‌‌లో అనేక ఆఫర్లు, కొత్త ఉత్పత్తుల లాంచ్‌‌‌‌‌‌‌‌లు ఉంటాయి. ఎస్​బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం ఆదా చేసుకోవచ్చు. 

అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుపై ఐదు శాతం క్యాష్‌‌‌‌‌‌‌‌బ్యాక్ వస్తుంది. 500లకు పైగా కొత్త ఉత్పత్తులు ఈ సేల్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంటాయి.  స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్లు, లాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌లు, ఫ్యాషన్, గృహోపకరణాలపై భారీ తగ్గింపులు ఉంటాయి.  కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌లను ప్రదర్శించనున్నారు.

©️ VIL Media Pvt Ltd.