Reading Time: 2 minutes

గ్రీన్ టీ vs బ్లాక్ టీ: షుగర్ కంట్రోల్‌కి ఏది బెస్ట్ ? తిన్న తర్వాత ఈజీగా కంట్రోల్ అయిపోతుంది..

Caption of Image.

ఈ రోజుల్లో బరువు తగ్గాలన్నా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా చాలా మంది టీ తాగే అలవాటును మార్చుకుంటున్నారు. అందులోనూ ముఖ్యంగా డయాబెటిస్/షుగర్ ఉన్నవారు లేదా రాకుండా చూసుకోవాలనుకునే వారు గ్రీన్ టీ, బ్లాక్ టీ వైపు ఇష్టపడుతున్నారు. అయితే, ఈ రెండు టీలు కామెల్లియా సినెన్సిస్ అనే ఒకే రకమైన మొక్క ఆకుల నుండి వస్తాయి. కానీ, వీటిని తయారు చేసే విధానం మాత్రం వేరువేరుగా ఉంటుంది.

గ్రీన్ టీ ఆకులను పెద్దగా ప్రాసెస్ చేయరు, అందుకే అందులో ‘EGCG కాటెచిన్స్’ అనే మంచి పోషకాలు అలాగే ఉంటాయి. అదే బ్లాక్ టీ ఆకులను పూర్తిగా ప్రాసెస్ చేస్తారు, దీనివల్ల ఆ పోషకాలు వేరేగా మారిపోతాయి. ఈ చిన్న మార్పు మన రక్తంలోని చక్కెర  స్థాయిలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో  సింపుల్‌గా తెలుసుకుందాం….. 

బ్లడ్ షుగర్ నియంత్రణలో ముఖ్యమైన తేడాలు
రక్తంలో చక్కెర స్థాయిలపై ఈ రెండు టీలు ఎలా పనిచేస్తాయో ఈ క్రింది పట్టిక (Table) ద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చు:

ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు గ్రీన్ టీ vs బ్లాక్ టీ: 

గ్రీన్ టీ: ఇది పరగడుపున ఉండే చక్కెర స్థాయిలను 2.1 mg/dL వరకు తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

బ్లాక్ టీ: ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు రక్తంలోని చక్కెర స్థాయిలపై  పెద్దగా ప్రభావం చూపించదు.

ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందంటే 

గ్రీన్ టీ:  ముఖ్యంగా 55 ఏళ్లలోపు వయసున్న యువకులలో, అలాగే ఆసియా ఖండానికి చెందిన ప్రజలలో బ్లడ్ షుగర్‌ను తగ్గించడంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుంది.

బ్లాక్ టీ: ఇలాంటి ప్రత్యేకమైన ప్రభావాలు ఏవీ దీనిలో కనిపించలేదు.

భోజనం చేసిన తర్వాత షుగర్ లెవెల్స్ :

గ్రీన్ టీ: అన్నం లేదా టిఫిన్ తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగకుండా చాలా కంట్రోల్ చేస్తుంది.

బ్లాక్ టీ: భోజనం తరువాత షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో గ్రీన్ టీ అంతగా ప్రభావం చూపలేదు.

ఇందులోని అక్టీవ్ కంపౌండ్స్:

గ్రీన్ టీ: ఇందులో EGCG అనే శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మనం తినే పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు) త్వరగా విచ్ఛిన్నం కాకుండా అడ్డుకుంటుంది.

బ్లాక్ టీ: ఇది తయారయ్యే ప్రాసెస్‌లో ఆకులు పూర్తిగా ఆక్సీకరణం చెందుతాయి. అందుకే దీనిలో ఆక్సీకరణ చెందిన పాలీఫెనాల్స్ (Theaflavins, Thearubigins) మాత్రమే ఉంటాయి.

ప్రతిరోజూ తప్పకుండా తాగడం వల్ల

గ్రీన్ టీ: ప్రతిరోజూ తప్పకుండా తాగడం వల్ల HbA1c స్థాయిలు 0.30% వరకు తగ్గే అవకాశం ఉందని మెటా-విశ్లేషణల్లో తేలింది.

బ్లాక్ టీ: HbA1c రీడింగ్స్‌లో బ్లాక్ టీ ఎలాంటి చెప్పుకోదగ్గ మార్పు తీసుకురాలేదు.

పరిశోధనల్లో రుజువైంది: ఒక వారం రోజుల పాటు జరిగిన రీసెర్చ్‌లో… బ్లాక్ టీ తాగే వారితో పోలిస్తే, గ్రీన్ టీ తాగిన వారిలో తిన్న తర్వాత చక్కెర స్థాయిలు చాలా తక్కువగా నమోదయ్యాయి.

 ముఖ్యమైన హెచ్చరిక:
మీరు ఎంత మంచి గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగినా… అందులో చక్కెర కలిపితే మాత్రం ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. తీపి కలిపినప్పుడు వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. కాబట్టి, వీటిని చక్కెర లేకుండానే తాగాలి.

బెస్ట్ రిజల్ట్స్ కోసం ఎలా తాగాలి?
గ్రీన్ టీ తాగే పద్ధతి: రోజుకు 2 నుండి 3 కప్పులు తాగవచ్చు. ముఖ్యంగా అన్నం, రొట్టెలు వంటి పిండి పదార్థాలు ఉన్న భోజనం చేసినప్పుడు గ్రీన్ టీ బాగా పనిచేస్తుంది.

సరైన సమయం: భోజనం చేసిన 30 నిమిషాలలోపు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

వీటికి దూరంగా ఉండండి: గ్రీన్ టీలో చక్కెర, పాలు లేదా తేనె అస్సలు కలపకూడదు.

బ్లాక్ టీ పరిస్థితి ఏంటి: ఇందులో కూడా మంచి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, కాబట్టి ఆరోగ్యానికి ఇది కూడా మంచిదే. కానీ షుగర్ కంట్రోల్ విషయానికి వస్తే మాత్రం గ్రీన్ టీ అంతగా బ్లాక్ టీ పనిచేయదు.

మొత్తంగా చూసుకుంటే, రక్తంలో షుగర్  కంట్రోల్లో ఉంచుకోవడానికి బ్లాక్ టీ కంటే గ్రీన్ టీ చాలా బెటర్. గ్రీన్ టీ ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు, అలాగే తిన్న తర్వాత వచ్చే షుగర్ లెవెల్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది. అయితే, మధుమేహం ఉన్నవారు ఈ రెండింటిలో ఏది తాగినా సరే… పాలు చక్కెర లేకుండా తాగినప్పుడే పూర్తి లాభాలు అందుతాయి.

©️ VIL Media Pvt Ltd.