Reading Time: < 1 minute

మరో క్రేజీ హాలీవుడ్‌‌‌‌ ప్రాజెక్ట్లో ప్రియాంక చోప్రా..

Caption of Image.

ఆల్రెడీ సక్సెస్ అయిన బాలీవుడ్‌‌‌‌లో కంఫర్టబుల్‌‌‌‌గా సినిమాలు చేయడం కంటే..  రిస్క్‌‌‌‌ చేసయినా హాలీవుడ్‌‌‌‌లో మెప్పించడమే తన లక్ష్యమని చెప్పిన ప్రియాంక చోప్రా.. అందుకు తగ్గట్టే వరుస ప్రాజెక్ట్స్‌‌‌‌తో అక్కడ దూసుకెళుతోంది. ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌లతో గ్లోబల్‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌గా ముందుకెళ్తోన్న ఆమె.. తాజాగా ఓ క్రేజీ హాలీవుడ్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌లో ఛాన్స్‌‌‌‌ అందుకుంది.

ఏంజెలినా జోలీతో క‌‌‌‌లిసి ఓ భారీ బ‌‌‌‌డ్జెట్ సినిమాలో ఆమె నటించబోతోంది. ఈ విషయాన్ని ప్రియాంకనే ఓ ఇంటర్వ్యూలో కన్‌ఫర్మ్ చేసింది. తాను హాలీవుడ్‌‌‌‌లో నటిగా కొనసాగడానికి ఏంజెలినా జోలీనే స్ఫూర్తి అని, ఆమెతో కలిసి స్క్రీన్‌‌‌‌ షేర్ చేసుకునే అవకాశం రావడం నమ్మలేకపోతున్నానని ప్రియాంక చెప్పింది.  

ఈ మూవీ సెట్స్‌‌‌‌లో అడుగు పెట్టబోయే క్షణాల కోసం ఎదురుచూస్తున్నట్టు ఆమె తెలిపింది.  ఇందులో ఆమె నెగెటివ్ షేడ్స్‌‌‌‌ ఉండే క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో ఏంజెలినాను ఢీకొట్టే పాత్ర పోషించబోతున్నట్టు టాక్. ఇక ఇటీవల వచ్చిన ‘ది బ్లఫ్‌‌‌‌’ సినిమాలో యాక్షన్‌‌‌‌ రోల్‌‌‌‌లో మెప్పించిన ఆమె,  ప్రస్తుతం ‘ది లార్డ్‌‌‌‌ ఆఫ్​ ది రింగ్స్‌‌‌‌’ ఫేమ్ అర్లాంబో బ్లూమ్స్‌‌‌‌తో కలిసి ఓ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌, నికోలస్‌‌‌‌ స్టోలర్‌‌‌‌‌‌‌‌ తెరకెక్కిస్తున్న ‘జడ్జిమెంట్‌‌‌‌’ అనే కామెడీ మూవీ,  మీరా నాయర్ తీస్తున్న బయోగ్రాఫికల్ డ్రామా ‘అమ్రి’లో నటిస్తోంది.  ఇక మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’తో ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఇండియన్‌‌‌‌ స్క్రీన్‌‌‌‌పై రీఎంట్రీ ఇస్తోంది.

©️ VIL Media Pvt Ltd.