Reading Time: < 1 minute

బ్యాటింగ్ లో తడబడిన భారత మహిళల జట్టు.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..!

Caption of Image.

IND-W vs SA-W: మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. దీంతో సౌతాఫ్రికా విజయానికి 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాప్ ఆర్డర్ ఇచ్చిన అదిరిపోయే స్టార్టింగ్‌ను మిడిల్, డెత్ ఓవర్లలో భారత బ్యాటర్లు సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది.

పవర్‌ప్లేలో కిరాక్.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్: 
భారత ఇన్నింగ్స్ చాలా మంచిగా స్టార్ట్ అయింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు కుదురుకుని ఆడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. దీంతో 30 పరుగుల వద్ద ఓపెనర్ మంధాన వికెట్ నష్టపోయింది. అయితే, ఆ తర్వాత ప్రోటీస్ బౌలర్లు మ్యాచ్‌ను తమ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు. ఇక అద్భుతమైన బౌండరీలు కొడుతున్న షఫాలీ వర్మ 54 పరుగుల దగ్గర ఔట్ అయింది. 

బిగ్ ఇన్నింగ్స్ ఆడని భారత్: 
భారత బ్యాటింగ్‌లో ఒక విచిత్రమైన రికార్డు నమోదైంది. జట్టులోని టాప్-7 బ్యాటర్లు అందరూ రెండంకెల స్కోరు (Double figures) అందుకున్నారు. కానీ, వారిలో ఏ ఒక్కరు కూడా భారీ స్కోరుగా లేదా హాఫ్ సెంచరీగా మలచలేకపోయారు. క్రీజులో సెట్ అయిన ప్రతిసారీ వికెట్లు పడిపోవడంతో.. మిడిల్, డెత్ ఓవర్లలో భారత్ ఒక బలమైన భాగస్వామ్యాన్ని (Partnership) నిర్మించలేకపోయింది. ఇదే భారత్‌ను 158 పరుగులకే కట్టడి చేసేలా చేసింది.

మరిజానే , ఇస్మాయిల్ క్లాస్ బౌలింగ్: 
సౌతాఫ్రికా బౌలర్లలో మరిజానే కాప్, షబ్నిమ్ ఇస్మాయిల్‌లు అద్భుతమైన బౌలింగ్‌తో భారత బ్యాటర్లను కట్టడి చేశారు. వీరిద్దరూ చెరో 2 వికెట్లు పడగొట్టి భారత ఇన్నింగ్స్ ను దెబ్బతీశారు. ముఖ్యంగా చివరి ఓవర్లలో వీరు కంప్లీట్ లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంతో టీమిండియాకు ఆశించిన స్కోరు రాకుండా అడ్డుకున్నారు. 

©️ VIL Media Pvt Ltd.