Reading Time: < 1 minute

బాలన్ బాగుందంటున్నారు

Caption of Image.

‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేమ్  చిదంబరం రూపొందించిన చిత్రం ‘బాలన్ : ది బాయ్’.  జితూ మాధవన్‌‌‌‌  స్క్రిప్ట్‌‌‌‌ను అందించగా,  కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మించారు. శుక్రవారం పాన్ ఇండియా వైడ్‌‌‌‌గా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా రన్ అవుతోందని మేకర్స్ తెలియజేశారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌లో  డైరెక్టర్ చిదంబరం మాట్లాడుతూ ‘తెలుగు ఆడియెన్స్‌‌‌‌కు  ఏ భాష సినిమా అనేది ఇంపార్టెంట్ కాదు.  మంచి కంటెంట్ ఉంటే ఆదరిస్తారు. అలాగే మా ‘మంజుమ్మెల్ బాయ్స్’  సినిమాపై  ఎంతో ప్రేమ చూపించారు. ఆ నమ్మకంతోనే  ‘బాలన్ ది బాయ్’  వంటి  డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని తీశాం.  మంచి సినిమాలకు టాలీవుడ్‌‌‌‌లో  ఎప్పుడూ స్పేస్ ఉంటుందని మరోసారి ప్రూవ్ చేశారు’ అని చెప్పాడు. 

నిర్మాత  శైలజా దేశాయి ఫెన్ మాట్లాడుతూ ‘తేస్పియన్ ఫిలింస్‌‌‌‌లో మొదటి చిత్రమిది. మాకు సపోర్ట్‌‌‌‌గా నిలిచిన  కేవీఎన్ ప్రొడక్షన్స్ వెంకట్  నారాయణకు థ్యాంక్స్. మా చిత్రానికొస్తున్న రెస్పాన్స్‌‌‌‌ పట్ల చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు.  నటులు జీన్ పాల్ లాల్, ఫర్జాన పాలతింగల్,  చైల్డ్ ఆర్టిస్ట్‌‌‌‌లు ముహమ్మద్ జినాన్, ఆదిశేషన్ పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.