కావాల్సిన పదార్దాలు: ఒక కప్పు కంది పప్పు, నాలుగు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి, నాలుగు బీన్స్, నాలుగు బంగాళాదుంప, కొద్దిగా కాలీఫ్లవర్, రెండు ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా తాలింపు గింజలు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కారం, ఇంకా నూనెను తీసుకోవాలి.
పప్పును బాగా ఉడికించుకోవాలి: ముందుగా ఒక కప్పు కంది పప్పును తీసుకుని కనీసం మూడు రెండు సార్లు కడిగి, కనాలుగు ప్పుల నీరు, ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే పప్పు ఉడకడానికి నూనెను వేసి ప్రెజర్ కుక్కర్లో వీటిని బాగా ఉడికించాలి. మీరు ఇంట్లో చేసేటప్పుడు కూడా ఇలాగే చేయండి.
కూరగాయలను మెత్తగా ఉడికించుకోవాలి: పప్పు బాగా ఉడికిన తర్వాత మీరు కట్ చేసుకున్న కూరగాయలు వేసి, వాటిలో కొద్దిగా అంటే రుచికి సరిపడా ఉప్పు, మళ్ళీ టేస్టింగ్ సాల్ట్ వేసి కూరగాయలు మెత్తగా అయ్యే వరకు దీని మీద మూత పెట్టి ఈ పప్పును బాగా ఉడికించాలి. ఇలా ఉడికిస్తే పప్పు మరింత రుచిగా ఉంటుంది.
టమోటాలను బాగా ఉడికించుకోవాలి : ఇక ఇప్పుడు దీనిలో కట్ చేసిన టమోటా ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి స్టవ్ మీద ఉంచి మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి. అలాగే, దీనిలో ఒక గ్లాస్ నీళ్లు పోసి, ఇంకా మంచి రుచి రావాలంటే ఈ పప్పును 10 నిమిషాల పాటు మీడియం మంట మీద గ్యాస్ మీదే ఉంచి ఉడికించాలి.
పప్పును పోపు పెట్టుకోవాలి: ఇప్పుడు రెండో సారి మళ్ళీ స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టుకుని దానిలో 4 టేబుల్ నూనె చేసి పోపు గింజలు, నాలుగు ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, 5 కరివేపాకు ఆకులు కూడా దీనిని పోపు పెట్టుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి ముక్కలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ కలపాలి. అంతే, పచ్చి కూరగాయల పప్పు రెడీ.




