Reading Time: 2 minutes
ఆ సినిమాలో చేసిందనుకు బాధపడ్డా.. అందుకే సినిమాలకు దూరం అయ్యా.! షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్

ఆనంద్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి కమలినీ ముఖర్జీ, స్టైల్, గోదావరి, గమ్యం వంటి పలు విజయవంతమైన చిత్రాలలో కథానాయికగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. చివరిగా 2014లో విడుదలైన గోవిందుడు అందరివాడేలే సినిమాలో కనిపించిన ఆమె, ఆ తర్వాత రెండు పరభాషా చిత్రాలు చేసి 2016 నుంచి సినీ రంగానికి పూర్తిగా దూరమయ్యారు. ఈ అందాల భామ స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. ఉన్నట్టుండి ఈ అమ్మడికి ఆఫర్స్ తగ్గాయి. అలాగే సెకండ్ హీరోయిన్ గా చేసింది. కానీ ఉన్నట్టుండి సినిమాలకు దూరంగా అయ్యింది.

ఇది కూడా చదవండి : ఆ జబర్దస్త్ నటుడు నన్ను దారుణంగా మోసం చేశాడు.. పిచ్చిపిచ్చిగా తిట్టి, కొట్టి చాలా హింసించారు

గతంలో కమలినీ ముఖర్జీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. టాలీవుడ్‌కు దూరం కావడానికి గల కారణాలను కమలినీ చెప్పుకొచ్చింది. తాను తెలుగులో బలమైన ఫీమేల్ రోల్స్ చేశానని, కొన్నిసార్లు సున్నితమైన అమ్మాయిగా కనిపించానని తెలిపింది కమలినీ ముఖర్జీ.  అయితే, గోవిందుడు అందరివాడేలే సినిమాలో తన పాత్రకు సరైన ప్రాముఖ్యత లేదని, సినిమా పూర్తయ్యాక తనకే ఇబ్బందిగా అనిపించిందని ఆమె పేర్కొంది. దర్శకుడు ఓ సీన్ చేయమన్నప్పుడు, తర్వాత ఎడిటింగ్‌లో ఎటువంటి సమాచారం లేకుండా దానిని తొలగించడం బాధ కలిగిస్తుందని చెప్పుకొచ్చింది. దీనిని తాను లైట్ తీసుకోలేకపోయానని తెలిపింది.

ఇది కూడా చదవండి : అందరూ అడుగుతున్నారు.. నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు.. సమంత ఎమోషనల్ కామెంట్స్

ఈ అనుభవాల తర్వాత తెలుగు సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నా అని కమలినీ తెలిపింది, కానీ ఇతర భాషల్లో సినిమాలు చేసింది కమలినీ ముఖర్జీ. 2016లో మలయాళ చిత్రం పులిమురుగన్ తర్వాత తనకు వివాహం అయిందని, అందుకే సినిమాల నుండి పూర్తిగా దూరంగా ఉన్నానని తెలిపింది. చిన్నప్పుడు చదువుపై దృష్టి పెట్టిన తాను, పెద్దయ్యాక సినిమాలు చేశానని, ఇప్పుడు భార్యగా కుటుంబాన్ని చూసుకోవాలని కోరుకుంటున్నానని కమలినీ ముఖర్జీ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : బాబోయ్..! ఇక్కడెక్కడి సినిమా రా అయ్యా..!! రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి.. ఎక్కడ చూడొచ్చంటే

Kamalinee Mukherjee

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి