Reading Time: < 1 minute

గురుకుల అద్దె బకాయిలు చెల్లించండి..ప్రభుత్వానికి గురుకుల భవనాల ఓనర్స్ వినతి

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల అద్దె బకాయిలు రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని ఓనర్లు కోరుతున్నారు.  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ  గురుకుల స్కూల్స్, హాస్టల్స్ మొత్తం 800 వరకు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో స్కూళ్లకు గత 4 నెలల నుంచి, హాస్టల్స్​కు గతేడాది నుంచి అద్దెలను ప్రభుత్వం విడుదల చేయలేదని చెబుతున్నారు. గురుకులాల అద్దె బకాయిలు, బెస్ట్ అవైల బుల్ స్కీం కింద ప్రభుత్వం చెల్లించాల్సినవి మొత్తం సుమారు రూ. 400 కోట్లు ఉన్నాయి.

అకడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన నేపథ్యంలో అద్దె బకాయిలు రిలీజ్ చేయాలని ఓనర్లు కోరుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే పలు సార్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఉన్నతాధికారులను కలిసి వినతితపత్రం ఇచ్చామని చెబుతున్నారు. బకాయిల విడుదలతో పాటు, అద్దె రేట్లను కూడా పెంచాలని యజమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

బకాయిల చెల్లింపు ఎలా?

రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు స్టార్ట్ అయ్యాయి. వచ్చే నెల 1 నుంచి క్లాసులు స్టార్ట్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ టైమ్​లో అద్దె బకాయిలు చెల్లించాలని ఓనర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ దేవెందర్ రెడ్డి కోరుతున్నారు. గతేడాది అద్దె కట్టకపోవడంతో చాలా జిల్లాల్లో స్కూళ్లు, హాస్టల్స్​కు  తాళాలు వేసి నిరసన తెలిపారు.

ఆ సమయంలో మంత్రులు జోక్యం చేసుకొని ఓనర్స్ అసోసియేషన్ నేతలతో చర్చలు జరిపడంతో బకాయిలను రిలీజ్ చేయడంతో  యథావిధిగా స్కూళ్లు, హాస్టల్స్ నిర్వహణ కొనసాగింది. ఈ సమ్మర్ లో అద్దె భవనాల్లో రిపేర్లు చేయాలని ప్రభుత్వం చెప్పింది. మరోవైపు, ప్రతీ రెండేళ్లకు ఒకసారి అద్దె పెంచుతూ రెన్యువల్ అగ్రిమెంట్ చేసుకోవాలని అని ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దేవెందర్ రెడ్డి కోరారు.

©️ VIL Media Pvt Ltd.