Reading Time: < 1 minute
సముద్రంలో శ్మశానవాటిక.. ఎవరిదో తెలుసా!

ఆగ్నేయ హిందూ మహాసముద్రంలో చైనా శాస్త్రవేత్తలు ఒక సంచలన ఆవిష్కరణ చేశారు. ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలోని ‘డయామంతినా ఫ్రాక్చర్ జోన్‌’లో సుమారు 7,002 మీటర్ల అంటే 7 కిలోమీటర్లు లోతులో ప్రపంచంలోనే అత్యంత లోతైన, అతిపెద్ద తిమింగలాల శ్మశానవాటికను గుర్తించారు. చైనాకు చెందిన ‘ఫెండౌఝే’ అనే అత్యాధునిక మానవసహిత జలాంతర్గామి సహాయంతో జరిగిన ఈ పరిశోధన వివరాలు ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. సుమారు 1,200 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో దాదాపు 50 లక్షల సంవత్సరాల క్రితం నాటి 500 తిమింగలాల శిలాజాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా 4 వేల మీటర్ల లోతులోనే ఇలాంటి అవశేషాలు కనిపిస్తాయి, కానీ ఇంతటి అగాధంలో లభించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. చనిపోయిన తిమింగలాల కళేబరాలు సముద్ర గర్భానికి చేరే ‘వేల్ ఫాల్’ ప్రక్రియ ద్వారా.. సూర్యరశ్మి కూడా చొరబడని ఆ కటిక చీకటిలో ట్యూబ్ వార్మ్స్, స్టార్ ఫిష్ వంటి అరుదైన జీవులకు ఇవి ఆహారంగా, ఆవాసంగా మారి ఒక సరికొత్త జీవ వ్యవస్థను సృష్టించాయి. ఈ పరిశోధనలో ఇప్పటివరకు ప్రపంచానికి తెలియని ఒక కొత్త తిమింగలం జాతి కూడా వెలుగులోకి వచ్చింది. ఈ శిలాజాలు గడిచిన 50 లక్షల ఏళ్లలో తిమింగలాల పరిణామ క్రమాన్ని, నాటి సముద్ర పర్యావరణ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఎంతగానో దోహదపడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమిపై అత్యంత కఠినమైన పరిస్థితుల్లోనూ జీవం ఎలా పరిఢవిల్లుతుందో చెప్పడానికి ఈ ఆవిష్కరణ ఒక తిరుగులేని నిదర్శనమని వారు పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

44 నుంచి 60 ఏళ్ల వయసులో మీ శరీరంలో జరిగేది ఇదే! అధ్యయనాల్లో కొత్త నిజాలు

బాత్రూమ్‌లో వింత శబ్దం.. వెళ్తే దిమ్మతిరిగే సీన్..

గ్యాస్‌ వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌! జూన్ 30 లాస్ట్‌ డేట్‌ ఏం చేయాలంటే?

ఇక పై డాక్టర్ చిట్టీ ఉంటేనే దగ్గు మందు! కాఫ్‌ సిరప్ కు బానిసగా యూత్‌.. చిన్నారుల ప్రాణం తీసే సిరప్!

సహారాలోనూ తప్పని ఆన్‌లైన్‌ మీటింగ్‌! ఒంటెపై ల్యాప్‌టాప్‌తో..