
రాంచరణ్, ఉపాసన దంపతుల గారాల పట్టి క్లీంకార ఫేస్ ఎట్టకేలకు రివీల్ చేశారు. పాప 3వ పుట్టినరోజు సందర్భంగా క్లీంకారను ఎత్తుకున్న ఫొటోను రాంచరణ్, ఉపాసన అధికారికంగా పోస్ట్ చేశారు. ఈ ఫొటోను గమనిస్తే.. అచ్చం తల్లి పోలికలతో ఉపాసనలానే ఉందని మెగా అభిమానులు మురిసిపోతున్నారు.
పాప పుట్టిన సమయం నుంచి ఇప్పటివరకూ ముఖం చూపించకుండా క్లీంకార ఫేస్ విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేసిన రాంచరణ్, ఉపాసన.. పాప ముఖం చూపించడంతో మెగా అభిమానులు పాప ఫొటో చూసి తన్మయత్వానికి లోనవుతున్నారు.
క్లీంకార అనే పేరుకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఒక్క బుుగ్వేదంలోనే దాదాపు 10 వేల 552 మంత్రాలు ఉన్నాయి. వాటిలో బీజ్ మంత్రాలు అత్యంత శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి. ఎందుకంటే అవి మానవులకు ఆధ్యాత్మికత, స్పృహ, జ్ఞానోదయం వంటి వాటిని చేకూరుస్తాయి. చాలా ముఖ్యమైన మంత్రాల్లో క్లీం అనేది ఒకటి. ఇది శక్తికి సంబంధించిన బీజాక్షరం.
ఈ మంత్రం చుట్టూ ఎంతో పాజిటివిటీ ఉంది. హిందువులు, బౌద్ధులు, ఇతర విశ్వాసాలు.. ప్రేమను సృష్టించేందుకు ఉపయోగించే అనేక ఆధ్యాత్మిక ఆచారాలలో క్లీం మంత్రం ఒకటి. ఇది అన్ని కాలాల్లోనూ అత్యంత శక్తివంతమైన మంత్రం. ఒక్కమాటలో చెప్పాలంటే అమ్మ వారి అంశ కలిసొచ్చేలా ఈ మెగా వారసురాలికి క్లీంకార అని పేరు పెట్టారు.