
అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ కలిగిన బ్యాంక్ ఆఫ్ బరోడాలోని కార్పొరేట్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్ (C&IC) విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన దేశంలోని వివిధ బ్రంచుల్లో మేనేజర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 86 మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జులై 6, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పోస్టుల వివరాలు ఇవే..
- మేనేజర్ – క్రెడిట్ అనలిస్ట్ పోస్టుల సంఖ్య: 4
- సీనియర్ మేనేజర్- క్రెడిట్ అనలిస్ట్ పోస్టుల సంఖ్య: 38
- చీఫ్ మేనేజర్- క్రెడిట్ అనలిస్ట్ పోస్టుల సంఖ్య: 1
- సీనియర్ మేనేజర్- సీ అండ్ ఐసీ రిలేషన్‌షిప్ పోస్టుల సంఖ్య: 36
- చీఫ్ మేనేజర్- సీ అండ్ ఐసీ రిలేషన్‌షిప్ పోస్టుల సంఖ్య: 7
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీతోపాటు ఫైనాన్స్ స్పెషలైజేషన్‌లో పీజీ /డిప్లొమా లేదా సీఏ/ సీఎంఏ/ సీఎస్/ సీఎఫ్‌ఏ వంటి అర్హతలు కలిగి ఉండాలి. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత బ్యాంకింగ్/ ఫైనాన్స్ అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి మేనేజర్ పోస్టులకు 25 నుంచి 30 ఏళ్లు, సీనియర్ మేనేజర్ పోస్టులకు 28 నుంచి 35 ఏళ్లు, చీఫ్ మేనేజర్ పోస్టులకు 32 నుంచి 42 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు వయసులో వయోసడలింపు వర్తిస్తుంది.
ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలోజులై 6, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్ధులు రూ.850, ఎస్సీ/ ఎస్టీ, మహిళలు, ఎక్స్‌సర్విస్‌మెన్ అభ్యర్ధులు రూ.175 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు గ్రేడ్ 2 పోస్టులకు రూ.93,960, గ్రేడ్3 పోస్టులకు రూ.1,05,280, గ్రేడ్ 4 పోస్టులకు రూ.1,20,940 చొప్పున జీతంతోపాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.