Reading Time: < 1 minute

కృష్ణలంక సీఐ నాగరాజుపై FIR : సాయికృష్ణ మిస్సింగ్ కేసులో విచారణ కోసం అరెస్ట్కు రెడీ

Caption of Image.

వివాదాస్పద కృష్ణలంక సీఐ నాగరాజు అరెస్ట్కు రంగం సిద్ధమైంది. శుక్రవారం (జూన్ 19) మధ్యాహ్నం లోపే అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గాదె సాయి వంశీకృష్ణ కేసులో గురువారం రాత్రి పదకొండు గంటలకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నుంచి సీపీ రాజశేఖర్ బాబు స్వయంగా కంప్లైంట్ తీసుకున్నారు. కంప్లైంట్ ఆధారంగా సీఐ నాగరాజుపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సాయి కృష్ణ తల్లికి కంప్లైంట్ కాపీ అందజేశారు పోలీసులు.కేసు విచారణ అధికారిగా దిశా పీఎస్ ఏసీపి దైవ ప్రసాద్ ను నియమించారు.

సీఐ నాగరాజుపై CR No – 107/2026 u/s 127(4) 127(6) 103(1) bns 238 bnss సెక్షన్ల కింద కేసులు నమోదయయ్యాయి. వంశీకృష్ణ హత్య, ఇంకొకరి ఆత్మహత్య ఘటనలతో సీఐపై ఇప్పటికే జనాల్లో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సీఐ నాగరాజు కేసు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.

వంశీకృష్ణ తల్లిని జగన్ పరామర్శించి ప్రభుత్వాన్ని నిలదీసిన తర్వాత సీఐ పై కేసులు నమోదు చేయడంతో ప్రభుత్వం మరింత ఇరకాటంలో పడింది. రాజకీయంగా జగన్ కు కలిసివచ్చిందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తం అవుతోంది. 

©️ VIL Media Pvt Ltd.