
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పవన్ కళ్యాణ్ కమలం పువ్వులో ఒక రెక్క అని… ఆయన బీజేపీ ఆడిస్తున్న ఆటలో పావుగా మారి వారు చెప్పినట్లు చేస్తున్నారని అన్నారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు జీర్ణించుకోవట్లేదని అన్నారు.
తెలంగాణ ఏర్పడితే… 11 రోజులు ఉపవాసం ఉన్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతారని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ముందుండి నడిపితే… ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ అని అన్నారు.
తెలంగాణ ప్రజలకు మరో పార్టీ అక్కర్లేదని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. తాను చిరంజీవికి అభిమానని కానీ… పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినం రోజే సభలు పెడతామంటే లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలగదా అని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్.
►ALSO READ | నాపై బీజేపీ కుట్ర చేసింది..రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మీనాక్షీ నటరాజన్
ఇక కర్ణాటకలో సీఎం మార్పుపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు మహేష్ కుమార్ గౌడ్. ముందస్తు ఒప్పందంలో భాగంగానే కర్ణాటకలో సీఎం మార్పు జరిగిందని… అక్కడి పరిస్థితులు వేరు, తెలంగాణలో పరిస్థితులు వేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీని మోసం చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి లేదని అన్నారు మహేష్ కుమార్ గౌడ్.