Reading Time: 2 minutes

Samantha : తల్లి కాబోతున్న సమంత.. మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్ లో ‘బేబీ బంప్’ ఫోటోలు లీక్!

Caption of Image.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం కెరీర్ పరంగానే కాకుండా పర్సనల్ లైఫ్‌లోనూ సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నారా? లేటెస్ట్ గా వచ్చిన ‘మా ఇంటి బంగారం’ సినిమాతో నిర్మాతగా, నటిగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సామ్.. త్వరలోనే తన అభిమానులకు అంతకు మించిన డబుల్ ధమాకా లాంటి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు. గత రెండు రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఒకే ఒక వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. సమంత త్వరలోనే తల్లి కాబోతున్నారు.

బయటపడ్డ సీక్రెట్?

టాలెంటెడ్ డైరెక్టర్ బి.వి. నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత స్వయంగా నిర్మించి, నటించిన లేడీ ఓరియెంటెడ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’. భారీ అంచనాల మధ్య జూన్ 19న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే అంచనాలను మించి ప్రపంచవ్యాప్తంగా రూ. 13 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. కేవలం సింగిల్ డేలోనే బ్రేక్ ఈవెన్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.

ఈ గ్రాండ్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ లేటెస్ట్ గా ఒక సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ వేడుకలో సమంత తన భర్త, ప్రముఖ దర్శకుడు-నిర్మాత రాజ్ నిడిమోరుతో కలిసి పాల్గొన్నారు. అయితే, ఈ వేడుకలో వైట్ కలర్ టీ-షర్ట్ ధరించిన సమంత ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ విజువల్స్‌లో సమంత ‘బేబీ బంప్’ స్పష్టంగా కనిపిస్తోందని, ఆమె గర్భవతి అనడానికి ఇదే నిదర్శనమని నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు.

 

సన్నిహిత వర్గాల టాక్.. కానీ?

గతేడాది డిసెంబర్‌లో రాజ్ నిడిమోరును వివాహం చేసుకుంది సమంత. తాను ఎల్లప్పుడూ ఒక అందమైన కుటుంబాన్ని ప్రారంభించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చేవారు . ఈ క్రమంలోనే సమంత ప్రెగ్నెన్సీ వార్తలపై ఆమెకు అత్యంత సన్నిహితంగా ఉండే వర్గాలనుఅడగగా.. అవును, సామ్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అని హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే, ఈ విషయంపై అటు సమంత కానీ, ఇటు రాజ్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. బహుశా ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ జంట, త్వరలోనే ఒక ప్రత్యేకమైన ముహూర్తాన ఈ శుభవార్తను అధికారికంగా అభిమానులతో పంచుకునే అవకాశం ఉందని సమాచారం. ఏదేమైనా ఈ క్రేజీ అప్‌డేట్‌తో సామ్ అభిమానులు డబుల్ పండగ చేసుకుంటున్నారు.
 

 

©️ VIL Media Pvt Ltd.