Reading Time: 2 minutes
Kieron Pollard Fight Asif Mahmood Breaks Chris Gayle T20 Record Mlc 2026

మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026 సీజన్‌లో భాగంగా వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎమ్ఐ న్యూయార్క్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. పాకిస్తాన్ సంతతికి చెందిన యూఎస్ఏ బౌలర్ ఆసిఫ్ మహమూద్‌తో మైదానంలోనే పెద్ద గొడవకు దిగాడు. పొలార్డ్ 21 పరుగులతో క్రీజులో ఉన్నప్పుడు, ఆసిఫ్ వేసిన బంతిని డిఫెండ్ చేశాడు. ఆ బంతిని అందుకున్న ఆసిఫ్, కోపంతో పొలార్డ్ వైపు విసురుతానంటూ అగ్రెసివ్‌గా సైగ చేశాడు. దీంతో తీవ్ర కోపానికి గురైన పొలార్డ్, గతంలో మిచేల్ స్టార్క్‌తో జరిగిన ఐపీఎల్ వివాదాన్ని గుర్తుచేస్తూ బౌలర్‌పైకి బ్యాట్ ఎత్తాడు. చివరి క్షణంలో తనను తాను కట్టడి చేసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది.

రికార్డు సెంచరీ వృథా..
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్, మిచెల్ ఓవెన్ (155 రన్స్) విధ్వంసకర ఇన్నింగ్స్ సాయంతో 20 ఓవర్లలో 245/5 భారీ స్కోరు సాధించింది. అనంతరం భారీ ఛేదనలో ఎమ్ఐ న్యూయార్క్ జట్టును కీరన్ పొలార్డ్ తన వీరోచిత శతకంతో ఒంటిచేత్తో నడిపించాడు.

56 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 100 పరుగులు బాదడమే కాకుండా, టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా క్రిస్ గేల్ (14,562 రన్స్) ఆల్‌టైమ్ రికార్డును బద్దలుకొట్టాడు. అయితే, ఇతర బ్యాటర్ల నుంచి సరైన మద్దతు లభించకపోవడంతో ఎమ్ఐ న్యూయార్క్ 215/6 పరుగులకే పరిమితమై 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.