
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి రైతు నేత అని విప్ విజయరమణా రావు అన్నారు. గురువారం ఆయన సీఎల్పీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతుల విషయంలో రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతుందని, ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించి, ప్రణాళికలు సిద్ధం చేశారని చెప్పారు.
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్, బీజేపీ నేతలకు లేదన్నారు. రామగుండంలో ఉత్పత్తి అయ్యే మొత్తం యూరియాను ఈ రాష్ట్ర రైతులకే ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు