Reading Time: 2 minutes
Cinema : ఒక్క పోస్టర్‏తోనే సంచలనం.. దెబ్బకు ఆడియోకే రూ.3 కోట్లు వచ్చాయి.. 90’s యూత్ సెన్సేషన్ ఈ మూవీ..

దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి తన కెరీర్, ముఖ్యంగా సిక్స్టీన్స్ చిత్ర విజయం వెనుక ఉన్న కథను గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇప్పుడే అవే కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఒక కథను నమ్మి సినిమా తీయడంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, భయపడకుండా తన పని తాను చేసుకుంటూ పోతానని ఆయన స్పష్టం చేశారు. తాను తీసిన సినిమాను ప్రొడ్యూసర్ నమ్మితేనే కొనాలని, అప్పుడే అది మంచి సినిమా అవుతుందని తాను నమ్ముతానని అన్నారు. ఆయన తొలి చిత్రం సిక్స్టీన్స్ (6టీన్స్) 38-40 లక్షల రూపాయల బడ్జెట్‌తో రూపొందింది. ఈ సినిమా టైటిల్, పోస్టర్ అప్పట్లో యువతలో ఒక సంచలనం సృష్టించాయి. హీరో వెనుకకు తిరిగి ఉన్న పోస్టర్‌పై ఇతర ఆర్టిస్టులను చూపించడం ఒక కొత్త పద్ధతిగా నిలిచింది. ‘దేవుడి వరం ఇస్తే’ పాట జనంలోకి దూసుకెళ్ళి, సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చింది. డిస్ట్రిబ్యూటర్లకు షో వేసినప్పుడు, సినిమా నచ్చి అందరూ కొనేందుకు ఆసక్తి చూపారు. అయితే, నిర్మాత జక్కుల శ్రీనివాస్ రెడ్డి ఒకే రోజులో డిస్ట్రిబ్యూటర్లకు అమ్మకుండా సినిమాను స్వయంగా ఉషా కిరణ్ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా ఆడియో రైట్స్ ద్వారానే అప్పట్లో 3 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చిందని, అలాగే సినిమా షేర్ కూడా 3 కోట్ల రూపాయలు తెచ్చిపెట్టిందని నాగేశ్వర రెడ్డి వెల్లడించారు. ఈ అద్భుతమైన విజయం పరిశ్రమలో అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : నవ్వుల రారాజును వెంటాడిన మృత్యువు.. రెండుసార్లు గెలిచినా.. వదలని మరణం..

సిక్స్టీన్స్ విజయం తర్వాత, నాగేశ్వర రెడ్డి తన తదుపరి చిత్రం ‘మొదటి ప్రేమలేఖ’ను కృష్ణా రెడ్డికి చూపించారు. అయితే, సిక్స్టీన్స్ యువత బేస్డ్ సినిమా కాగా, కృష్ణా రెడ్డి ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలను ఇష్టపడతారని, అందుకే ‘సిక్స్టీన్స్’ను ఆయనకు చూపించలేదని తెలిపారు. ‘మొదటి ప్రేమలేఖ’ మంచి కథ అయినప్పటికీ, అది ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇందులో శ్రీహరి బావమరిది జయరాం హీరోగా నటించగా, రిమా సేన్ హీరోయిన్‌గా చేసింది. రిమి సేన్ తరువాత చిరంజీవి సినిమాలో (ధూమ్) కూడా నటించింది. ‘మొదటి ప్రేమలేఖ’లో ‘సిక్స్టీన్స్’లోని అల్లరితనం లేకపోవడం, డీసెన్సీని ఎక్కువగా అప్లై చేయడం వల్ల అది విజయవంతం కాలేదని నాగేశ్వర రెడ్డి తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : ఇప్పుడున్న హీరోలలో అతడు ది బెస్ట్.. అతడి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం.. కృష్ణ మనసులోని మాట..

తొలి సినిమా హిట్ అయిన తర్వాత, రెండవ సినిమా విజయం సాధించడం చాలామంది దర్శకులకు ఒక సవాలుగా ఉంటుందని, దీనిని “సెకండ్ సిండ్రోమ్” అని పిలుస్తారని ఆయన పేర్కొన్నారు. రాజమౌళి వంటి కొద్దిమంది మినహా, చాలామంది దర్శకులకు ఇది ఎదురవుతుందని ఆయన అన్నారు. ఈ సిండ్రోమ్‌ను అధిగమించి, నాగేశ్వర రెడ్డి వెంటనే ‘గర్ల్ ఫ్రెండ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘సిక్స్టీన్స్’ హీరో రోహిత్‌తోనే, అంకితా పటేల్ హీరోయిన్‌గా ఈ సినిమాను రూపొందించారు. తన స్నేహితుడు కుమారస్వామిని నిర్మాతగా మార్చారు. ‘గర్ల్ ఫ్రెండ్’ కూడా ఒక పెద్ద విజయంగా నిలిచింది. ఈ సినిమా ఆడియో కూడా భారీ హిట్ అయింది. ‘నువ్వెక్కడికెళ్తే ఆడికొస్తా సోనియా’, ‘ప్రేమ ఎంత పనిచేసే నారాయణ’ వంటి పాటలు అప్పట్లో ఎంతో ప్రజాదరణ పొందాయి. తన బలాన్ని నమ్ముకొని ముందుకు సాగడం వల్లే ఈ విజయం సాధ్యమైందని జి నాగేశ్వర రెడ్డి తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో సినిమాలు… కట్ చేస్తే.. 51 ఏళ్ల వయసులో ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటే..