Reading Time: < 1 minute
How To Clean Wooden Rolling Pin Remove Fungus Mold

kitchen tips: ఇంట్లో ప్రతిరోజూ చపాతీలు, పూరీలు చేసుకోవడానికి మనం ఉపయోగించే చెక్క చపాతీ కర్ర (Rolling Pin) విషయంలో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల లేదా కడిగిన తర్వాత సరిగ్గా ఆరబెట్టకపోతే చెక్క చపాతీ కర్రలపై బూజు (Fungi), కంటికి కనిపించని సూక్ష్మక్రిములు (Germs) సులభంగా చేరిపోతాయి. ఇలాంటి చపాతీ కర్రను అలాగే ఉపయోగించి వంట చేయడం వల్ల కాలేయం, జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా ఇంట్లోనే నాచురల్ చపాతీ కర్రను ఎలా క్లీన్ చేసుకోవాలో, క్రిమిరహితంగా ఎలా మార్చుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సహజసిద్ధమైన క్లీనింగ్ ప్రాసెస్ ఇదే..

మొదట చపాతీ కర్రపై కొద్దిగా నీళ్లు చల్లి, ఆపై కొంచెం రాతి ఉప్పు వేయాలి. ఈ ఉప్పు చెక్క చుట్టూ బాగా తగిలేలా చేత్తో గట్టిగా రుద్దాలి. రాతి ఉప్పులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు చెక్కపై పేరుకుపోయిన జిడ్డును, పిండి మురికిని వదిలిస్తాయి. ఉప్పుతో బాగా రుద్దిన తర్వాత శుభ్రమైన నీటితో ఆ చపాతీ కర్రను పూర్తిగా కడిగేయాలి. తర్వాత కడిగిన వెంటనే ఒక పొడి క్లాత్‌తో తుడిచి, ఆపై స్టవ్ వెలిగించి మంటపై చపాతీ కర్రను కొద్ది దూరం నుంచి వేడి చేయాలి. చుట్టూ తిప్పుతూ కాసేపు వేడి చేయడం వల్ల చెక్క రంధ్రాలలో దాగి ఉన్న తేమ పూర్తిగా ఆరిపోతుంది. ఇలా మంటపై వేడి చేయడం వల్ల లోపల దాగి ఉన్న సూక్ష్మక్రిములు, ఫంగస్ పూర్తిగా నశించిపోతాయి.

చపాతీ కర్రను కడిగిన తర్వాత ఎప్పుడూ చీకటిగా ఉండే క్యాబినెట్లలో లేదా డ్రాయర్లలో వెంటనే పెట్టకూడదు. గాలి తగిలే చోట లేదా ఎండలో కాసేపు ఉంచడం వల్ల బూజు పట్టకుండా ఉంటుంది. నెలకు ఒకసారి ఈ చిన్న ట్రిక్ ఉపయోగించడం ద్వారా 100 శాతం చపాతీ కర్రను క్రిములు లేకుండా, సరికొత్తగా మార్చుకోవచ్చు. మీ వంటింట్లో కూడా ఈ చిట్కాను ఒకసారి ట్రై చేసి చూడండి.