Reading Time: 2 minutes
Viral Video: నీ ధైర్యానికి దండం రా సామీ.. పాముతో ఫుట్‌బాల్ ఆడుకున్నాడు.. వీడియో చూస్తే దిమ్మతిరిగిపోద్ది..

సాధారణంగా పాము పేరు చెబితేనే భయపడతారు. ఒకవేళ కనిపిస్తే వణికిపోతారు. ఎంతటి ధైర్యశాలికైనా ఎదురుగా పాము వచ్చి బుసలు కొడితే నోట మాట రాదు. అయితే ఓ వ్యక్తి మాత్రం పడగవిప్పి బుసలు కొట్టే పాముతోనే ఆటలు ఆడాడు. అస్సలు భయపడకుండా దాన్ని కాలితో తంతూ, ఫుట్‌బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ సంఘటన వియత్నాం దేశంలో చోటుచేసుకుంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి పొలం గట్టుపై సాధారణంగా నిలబడి ఉన్నాడు. అంతలోనే భారీ పాము గట్టు కింద నుంచి ఒక్కసారిగా పైకి లేచింది. సాధారణంగా ఎవరైనా అయితే అక్కడ నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఏమాత్రం బెదరలేదు. పాము కాటేయడానికి ముందుకు రాగానే.. తన కుడికాలితో దాన్ని బలంగా తన్నాడు.

తగ్గేదే లేదంటూ కింగ్ కోబ్రా రీ-ఎంట్రీ

ఆ తన్నుకు ఆ పాము కాస్త దూరంలో వెళ్లి పడింది. కానీ ఆ పాము కూడా ఏమాత్రం తగ్గలేదు. తీవ్రమైన కోపంతో మరింత వేగంగా బుసలు కొడుతూ మళ్లీ ఆ వ్యక్తిపైకి దూసుకొచ్చింది. అతను మళ్లీ ఏమాత్రం తడుముకోకుండా రెండోసారి కూడా దాన్ని కాలితో గాల్లోనే తన్నాడు. ఇలా పాము కాటేయడానికి ముందుకు రావడం.. ఆ వ్యక్తి దాన్ని కాలితో ఫుట్‌బాల్‌లా తన్నడం.. మళ్లీ ఆ పాము పగబట్టినట్టు పైకి రావడం.. వీడియో చూస్తున్నంత సేపు గుండె ఆగినంత పనవుతుంది.

నెటిజన్లు షాక్.. మీకెందుకు సామి ఇంత దైర్యం

ఈ భయంకరమైన ఫైటింగ్‌ను అక్కడే ఉన్న కొందరు కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘‘ఇతను మనిషా లేక యముడా? పాముతో ఆడుకోవడం ఏంటి బాస్’’ అని కొందరు కామెంట్స్ పెడుతుంటే.. ‘‘ చిన్న తప్పు జరిగినా ఆ పాము కాటుకు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.. ఇలాంటి ప్రాణాంతక స్టంట్స్ అస్సలు చేయకండి’’ అంటూ మరికొందరు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

వీడియో చూడండి..