
యాదాద్రి, వెలుగు : ట్రైన్ నుంచి జారిపడి తీవ్ర గాయాలతోట్రీట్మెంట్ పొందుతూ గుర్తు తెలియని యువకుడు (20) మృతిచెందాడు. ఈ నెల 5న నడికుడి నుంచి కాచిగూడకు వెళ్తున్న డెమో ట్రైన్ నుంచి బీబీనగర్, ఘట్కేసర్ స్టేషన్ల మధ్య ఓ యువకుడి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. భువనగిరి రైల్వే పోలీసులు అతడిని గాంధీ హాస్పిటల్కు తరలించారు. ట్రీట్మెంట్ పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి చాతిపై సిద్ధు, రెండు చేతులకు రోజా, ఐసూ టాటూలు ఉన్నాయని భువనగిరి రైల్వే పోలీస్ ఇన్చార్జ్ జే కృష్ణారావు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 98482 22169 నెంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు.