
సత్యదేవ్ లీడ్‌గా దర్శకుడు వెంకటేశ్ మహా రూపొందిస్తున్న చిత్రం ‘రావు బహదూర్’. మహేష్‌బాబుకు సంబంధించిన జిఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర కలిసి నిర్మిస్తున్నారు. జులై 3న విడుదల కానుంది. శనివారం ‘దేశ సంచారి’ అనే రెండో పాటను విడుదల చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో సత్యదేవ్ మాట్లాడుతూ ‘ఈ పాట రెట్రో స్టయిల్‌లో సాగుతూ ఆకట్టుకుంటుంది.
నా కెరీర్‌లోనే ఫస్ట్ టైం ఈ స్థాయిలో డ్యాన్సులు చేశాను. ఇది సల్సా స్టయిల్ డ్యాన్స్. నిజానికి ఇలాంటి డ్యాన్స్ చేయాలంటే పది, పదిహేనేళ్ల ప్రాక్టీస్ కావాలి. నాకు ఎంతో ఓపికగా నేర్పించి చేయించిన మా డ్యాన్స్ మాస్టర్‌కు థ్యాంక్సు. ఈ సినిమాలో మొత్తం ఏడు గెటప్స్ ఉన్నాయి.
అందులో నాకు చాలా ఇష్టమైనది రామప్ప గెటప్’ అని చెప్పాడు. దర్శకుడు వెంకటేశ్ మహా మాట్లాడుతూ ‘ఈ పాటలో సత్యదేవ్ డ్యాన్స్ చేస్తుంటే నేను మానిటర్ దగ్గర చాలా ఎక్సయిట్ అయ్యేవాడిని. రెండు రోజుల్లో షూట్ చేశాం. ఇందులోని ప్రతి స్టెప్‌ను మేమంతా ఎంతో సెలబ్రేట్ చేసుకున్నాం. సత్యదేవ్.. కమల్ హాసన్ స్థాయిలో పెర్ఫార్మ్ చేస్తాడు’ అని చెప్పాడు.
ఇందులో ఉన్న మిగతా రెండు పాటలు కూడా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తాయని నిర్మాత అనురాగ్ అన్నారు. స్మరణ్ సాయి కంపోజ్ చేసిన పాటకు రెహమాన్ సాహిత్యం అందించగా, హేమచంద్ర, ప్రియాంక గజానన్ పాడారు.