Reading Time: 2 minutes

సౌతాఫ్రికాతో కీలక పోరు.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్

Caption of Image.

IND-W vs SA-W: మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా సౌతాఫ్రికాతో జరగబోతున్న హై-వోల్టేజ్ పోరులో టాస్ గెలిచిన భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ తీసుకుంది. ఈ మ్యాచులో ఇరు జట్లు పలు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఒక కీలక మార్పు జరగగా.. ప్రోటీస్ టీమ్ లో రెండు కీలక మార్పులు చేసినట్లు కెప్టెన్ వెల్లడించింది. 

భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ మాట్లాడుతూ.. ఇదొక అద్భుతమైన ప్రయాణమని, తాను ఇంత దూరం వస్తానని ఎప్పుడూ అనుకోలేదని భావోద్వేగానికి ఆమె గురైంది. తన 200వ మ్యాచ్ ఆడుతుండటం కొంచెం నర్వస్‌గా ఉంది, గాయం కారణంగా స్టార్ బౌలర్ శ్రేయాంక పాటిల్ ఈ మ్యాచ్‌కు దూరం కాగా, ఆమె స్థానంలో ప్రేమ రావత్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం (Debut) చేస్తుందని హర్మన్‌ప్రీత్ నవ్వుతూ చెప్పుకొచ్చింది. అలాగే జట్టులో మరో క్రాంతి గౌడ్ స్థానంలో అరుంధతి రెడ్డి తుది జట్టులోకి వచ్చిందని కెప్టెన్ స్పష్టం చేసింది.

►ALSO READ | 29 బంతుల్లో 94 రన్స్ కొట్టిన వైభవ్.. శ్రీలంకను చిత్తు చేసి టైటిల్ గెలిచిన భారత్ ఏ

సౌతాఫ్రికా కెప్టెన్ లారా వాల్వార్ట్ మాట్లాడుతూ.. ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ చాలా నెమ్మదిగా (Slow) ఉందనే విషయాన్ని గుర్తు చేసింది. స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలించే ఛాన్స్ ఉండటంతో, స్పిన్‌ను అద్భుతంగా ఆడగల ఇద్దరు స్పెషలిస్ట్ బ్యాటర్లను తమ తుది జట్టులోకి తీసుకువచ్చినట్లు ఆమె తెలిపింది. ఇటీవల ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్‌పై గెలిచిన రికార్డు ఉన్నప్పటికీ.. వరల్డ్ కప్‌లలో భారత్‌దే పైచేయిగా ఉందని ఆమె అంగీకరించింది.

ఇరు జట్లు:
దక్షిణాఫ్రికా మహిళల జట్టు: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అన్నరీ డెర్క్‌సెన్, డేన్ వాన్ నీకెర్క్, మారిజాన్ కాప్, నాడిన్ డి క్లెర్క్, క్లో ట్రయాన్(వికెట్ కీపర్), సినాలో జాఫ్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, అయాబొంగా ఖాకా, నాన్‌కులులేకో మలాబా

భారత మహిళల జట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తిక భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమ రావత్, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి, నందిని శర్మ

©️ VIL Media Pvt Ltd.