
ఇండియా ఫ్యూచర్ స్టార్.. చిచ్చర పిడుగు వైభవ్ సూర్య వంశీ వండేల్లో సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్ లో విరుచుకు పడినట్లే ఉతికారేస్తూ.. వన్డేల్లో హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆదివారం (జూన్ 21) శ్రీలంకఏ తో జరిగుతున్న వండేలో కేవలం 11 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి పాత రికార్డులను తిరగ రాశాడు.
శ్రీలంక-A తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక.. ఇండియన్ బ్యాటర్ల జోరుకు నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి.
విధ్వంసక చిచ్చరపిడుగు మొన్నటి మ్యాచ్ కు రివెంజ్ అన్నట్లుగా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. కేవలం 11 బంతులలో హాఫ్ సెంచరీ చేసి ఊచకోత కోశాడు. 5 సిక్సులు, 5 ఫోర్లతో ఓన్లీ బౌండరీస్ తోనే ఫిఫ్టీ ఫినిష్ చేశాడు. ముఖ్యంగా 3వ ఓవర్ లో లంక బౌలర్ మహమ్మద్ సిరాజ్ ను ఉతికారేశాడు. 4,6,6,0,6,4 తో ఆ ఓవర్ లో ఏకంగా 26 రన్స్ పిండుకున్నాడు.
11 బంతులలో అర్థ సెంచరీ చేసిన వైభవ్.. గతంలో ఉన్న రికార్డులన్నింటినీ తుడిచేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు సౌతాఫ్రికా ప్లేయర్ డివిలయర్స్ పేరు ఉంది. AB డివిలయర్స్ 2015 లో వెస్ట్ ఇండీస్ పై 16 బంతులలో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత 2025లో వెస్ట్ ఇండీస్ బ్యాటర్ మాథ్యూ ఫోర్డె కూడా 16 బంతులలో హాఫ్ సెంచరీ చేశాడు.
World Record by Vaibhav Sooryvanshi 🔥
Scored fastest fifty in 11 Balls
4,4,4,6,6,0,6,4,4,6,6 #VaibhavSooryavanshi pic.twitter.com/jL6nghhVXG
— Arun Vijay (@AVinthehousee) June 21, 2026