Reading Time: < 1 minute
Priyadarshi Sukumar Writings Bunny Vas New Movie Nagadurga

Sukumar: ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కలిసి ప్రియదర్శి హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నారు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నాగదుర్గ హీరోయిన్‌గా నటించనుంది. తాజాగా ఈ మూవీ టీమ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్‌ను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ నాగదుర్గ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపారు.

సుకుమార్ – బన్నీవాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై మూవీ లవర్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రామిసింగ్ మూవీస్ చేస్తున్న ప్రియదర్శి హీరో కావడం, ఏ ఫోక్ సాంగ్ చేసినా మిలియన్స్‌లో వ్యూస్ రాబట్టే క్రేజ్ ఉన్న నాగదుర్గ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ మరింత క్రేజీగా మారింది. ఈ సినిమాను యువ డైరెక్టర్ వంశీరెడ్డి దొండపాటి తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ నెల 25 నుంచి పూజా కార్యక్రమాలతో స్టార్ట్ కానున్న ఈ సినిమా వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ క్రేజీ కాంబో మూవీ గురించి మరిన్ని డీటెయిల్స్ త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.