భారీ వానలు పడుతున్నప్పుడు మీ ఇంట్లో ఉండి చేసుకునే రెసిపీ ఇదే. అయితే, వీటిని సాయంత్రం సమయంలో తింటే నోటికి రుచికరంగా ఉంటుంది. ఇంకా వేడి వేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే, టీతో తినడానికి కూడా అదిరిపోయే రుచి ఉంటుంది. అవే అటుకుల వడలు సూపర్ స్నాక్.
అటుకుల వడలకు కావాల్సిన పదార్ధాలు : రెండు కప్పులు అటుకులు, ఒక పెద్ద ఉల్లిపాయ, 10 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, 10 కరివేపాకు ఆకులు, నాలుగు కొత్తిమీర ఆకులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్స్ బియ్యపు పిండి, రుచికి తగినంత ఉప్పు, ఇంకా వడలు వేయించడానికి సరిపడా నూనె తీసుకోవాలి.
అటుకుల వడలు తయారి విధానం : ముందుగా అటుకులను తీసుకుని వాటిని చక్కగా శుభ్ర పరిచి 10 నిమిషాలు పాటు నానబెట్టాలి. ఆ తర్వాత దీనిలో నీరు మొత్తాన్ని పూర్తిగా వంపేసి అటుకులను మాత్రమే ఒక ప్లేట్ లో కానీ గిన్నెలో కానీ వీటిని వేసుకోవాలి. సరైన కొలతలతో దీనిని చేస్తే రుచిగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇలాగే ట్రై చేయండి.
అటుకుల వడలు తయారి విధానం స్టెప్ 1: అటుకుల వడల మిశ్రమంలో దానిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, నాలుగు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. ఇక ఇప్పుడు బియ్యపు పిండి కూడా వేసి ముద్దలాగా కలపాలి. ఈ మిశ్రమం మరీ పలుచగా ఉంటే ఇంకా కొద్దిగా బియ్యపు పిండి కలిపితే సరిపోతుంది.
అటుకుల వడలు తయారి విధానం స్టెప్ 2: ఇక ఇప్పుడు చేతికి కొంచం ఆయిల్ రాసుకుని చిన్న చిన్న వడలుగా ఒత్తుకోవాలి. ఇప్పుడు పాన్ తీసుకుని ఆయిల్ వేసి, మీడియం మంటపై వడలను ఒక వైపు కాల్చుకున్న తర్వాత గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి. రెండు వైపులా వేగిన తర్వాత వాటిని తీసి టిష్యూపై వేసుకోవాలి.




