డబ్బు అనేది ప్రతి ఒక్కరికీ జీవితంలో అత్యంత ప్రాథమికమైన అవసరం. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరిపై ఉంటే.. వారి ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలకాలం నిలిచి ఉంటాయి. మరి ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం ఎలాగో గొప్ప ఆర్థికవేత్త అయిన ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో చాలా వివరంగా చెప్పారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ ఇంట్లో డబ్బుకు అస్సలు లోటు ఉండదు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు ముచ్చటించుకుందాం.
సంబంధాలతో పాటు డబ్బుకు విలువ ఇవ్వండి: మన జీవితంలో బంధుత్వాలు, స్నేహాలతో పాటు డబ్బుకు కూడా సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలని చాణక్యుడు చెప్పారు. ఎందుకంటే బంధాలైనా, డబ్బులైనా సంపాదించడం చాలా కష్టం… కానీ ఒక్క చిన్న పొరపాటుతో కోల్పోవడం చాలా సులభం. అందుకే దేన్నీ తేలికగా తీసుకోకుండా, ప్రతిదానికీ తగిన గౌరవం ఇవ్వాలి.

పొదుపు చేసే అలవాటు ఉండాలి: మనం ఎంత సంపాదిస్తున్నాం అనేదాని కంటే, అందులో ఎంత పొదుపు చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. సంపాదన ఉందని ఇష్టమొచ్చినట్టు వృధా ఖర్చులు చేయకూడదు. డబ్బును జాగ్రత్తగా దాచుకునే వారిపై లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. ఇక మనం పొదుపు చేసిన ఆ డబ్బే, భవిష్యత్తులో మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు కొండంత అండగా నిలబడుతుంది.
ఐక్యత, ప్రేమ ఉన్న ఇల్లు : ఏ ఇంట్లో అయితే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు లేకుండా ఐక్యత, పరస్పర ప్రేమ ఉంటాయో.. ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది. ఇక ఎప్పుడూ గొడవలు జరిగే చోట ప్రశాంతత ఉండదు, లక్ష్మీదేవి కూడా అక్కడ నిలవదు. కుటుంబంలో అందరూ కలిసికట్టుగా ఉంటే లక్ష్మీదేవి నడచుకుంటూ వస్తుంది.
ఆడవారికి, పెద్దలకు గౌరవం: ఇంటి పెద్దలను భక్తిశ్రద్ధలతో చూసుకునే చోట, అలాగే ఆడవారిని ఎక్కడైతే గౌరవిస్తారో ఆ ఇళ్లలో సంపదకు ఎప్పటికీ కొరత ఉండదు. ఇక స్త్రీలను గౌరవించే కుటుంబాలు ఎప్పుడూ ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో ఉంటాయని చాణక్య నీతి చెబుతోంది.
లక్ష్మీదేవి కేవలం పూజలు చేసినంత మాత్రాన ప్రసన్నం కాదు. మన ప్రవర్తన బాగుండి, డబ్బును గౌరవిస్తూ పొదుపుపై శ్రద్ధ పెట్టినప్పుడే ఆమె మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలను పాటిస్తే జీవితం ఎంతో సరళంగా, సంతోషంగా సాగుతుంది.
గమనిక: డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని సన్మార్గంలో ఖర్చు చేయడం కూడా అంతే ముఖ్యం. అనవసరపు హంగుల కోసం అప్పులు చేయడం మానుకుంటే ఆర్థిక ఇబ్బందులు దరిచేరవు.
The post ఈ చోట్ల లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుందట! చాణక్యుడు చెప్పిన సీక్రెట్ appeared first on Manalokam – Latest Telugu News & Updates.