
Klin Kaara: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల దంపతుల గారాల పట్టి క్లిం కారా (Klin Kaara) మూడో పుట్టినరోజు వేడుకలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఒక ఆసక్తికరమైన పోలిక ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. క్లిం కారా బర్త్ డే (జూన్ 20) సందర్భంగా ఉపాసన షేర్ చేసిన అరుదైన ఫ్యామిలీ ఫోటోను చూసిన నెటిజన్లు – మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ముఖ్యంగా క్లిం కారా ముఖకవళికలు అచ్చం రామ్ చరణ్ చిన్నప్పటిలాగే ఉన్నాయంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.
రామ్ చరణ్ చిన్నతనంలో ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను, ప్రస్తుత క్లిం కారా లేటెస్ట్ లుక్స్‌ను పక్కపక్కన పెట్టి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. “కారా పాప అచ్చం రామ్ చరణ్ గారి చైల్డ్‌హుడ్ డేస్‌కు కార్బన్ కాపీలా ఉంది.. 
” అంటూ కొణిదెల వారసురాలిపై మెగా అభిమానాన్ని చాటుకుంటున్నారు. తండ్రీకూతుళ్ల పోలికలు అంతలా మ్యాచ్ అవ్వడంతో మెగా లెగసీ మళ్లీ రిపీట్ అయిందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సాధారణంగా క్లిం కారా ముఖం కనిపించకుండా జాగ్రత్తపడే చరణ్ – ఉపాసన జంట, ఈసారి థర్డ్ బర్త్‌డే సందర్భంగా క్లియర్ అండ్ క్యూట్ ఫ్యామిలీ పిక్‌ను షేర్ చేయడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ ‘కార్బన్ కాపీ’ కామెంట్స్, చరణ్ చైల్డ్‌హుడ్ ఫోటోలు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.