Reading Time: < 1 minute

నీట్ యూజీ రీఎగ్జామ్‌.. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు నో ఎంట్రీ ..బోరున విలపించిన విద్యార్థులు

Caption of Image.

తెలంగాణలో నీట్ యూజీ రీఎగ్జామ్  ఆదివారం (జూన్21)  ప్రారంభమయ్యింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లను పూర్తి చేశారు. అభ్యర్థులను నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఎన్టీఏ పలు కఠిన నిబంధనలను విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాల తర్వాత విద్యార్థులను హాల్స్ లోకి అనుమతించమని ఇప్పటికే అధికారులు వెల్లడించారు.  కొన్ని చోట్ల ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్ష హాల్ లోకి అనుమతివ్వకపోవడంతో బోరున విలపించారు.  ఏడాదంతా చదివిన విద్యార్థులు.. పరీక్ష రాయలేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘నీట్ యూజీ’ రీ- ఎగ్జామ్ ఆదివారం దేశ, విదేశాల్లో అత్యంత కఠినమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగింది. గతంలో జరిగిన నీట్ పరీక్షపై పేపర్ లీకేజీ ఆరోపణలు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌‌టీఏ) మళ్లీ ఎగ్జామ్ నిర్వహిస్తోంది. దీనికి  దేశ వ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరవుతున్నారు. అయితే, దేశంలోనే ప్రముఖ కోచింగ్ హబ్ అయిన రాజస్తాన్‌‌లోని కోటాలో ఈసారి విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత పరీక్షలో కోటా నుంచి 38,614 మంది రాయగా.. ఈసారి ఆ సంఖ్య 32,715 కి పడిపోయింది. పేపర్ లీక్ గందరగోళం తర్వాత విద్యార్థులు తమ సొంత ఊర్లకు దగ్గరగా ఉన్న పరీక్షా కేంద్రాలను ఎంచుకోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తున్నది. కోటాలోని 92 పరీక్షా కేంద్రాలతో పాటు అన్ని ఎగ్జామ్ సెంటర్ల వద్ద అధికారులు..సీసీటీవీ నిఘా, సిగ్నల్ జామర్లు, ప్రత్యేక పోలీసు బృందాలతో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. 

©️ VIL Media Pvt Ltd.