
Thaman S: టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరోసారి తన ఉదారతను చాటుకొని రియల్ హీరో అనిపించుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు వీరాభిమాని అయిన రాజేష్ గతేడాది మరణించగా, అతని ఇద్దరు పిల్లల స్కూల్ చదువులకు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని గతంలో ఇచ్చిన మాటను ఆయన తాజాగా నిలబెట్టుకున్నారు. గతేడాది రాజేష్ మరణంతో అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ (SKN) స్పందించి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఆ సమయంలోనే ఈ ఘటనపై స్పందించిన తమన్.. ఆ చిన్నారుల చదువు బాధ్యత తనదేనని ప్రామిస్ చేశారు. ఈ క్రమంలో, ఇటీవల స్కూళ్లు స్టార్ట్ కావడంతో జూన్ 17న ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా తమన్ చేసిన పాత వాగ్దానాన్ని గుర్తు చేస్తూ రీ-ట్వీట్ చేశారు.
దీనిపై తమన్ స్పందించారు. రాజేష్ పిల్లలైన శివరామ్, సారికశ్రీల స్కూల్ ఫీజులను వెంటనే చెల్లించి, దానికి సంబంధించిన రశీదులను (Receipts) సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా తమన్ స్పందిస్తూ.. “సోదరా, స్కూల్ ఫీజులు చెల్లించేశాను. దయచేసి ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలియజేయండి. వారి స్కూల్ చదువు పూర్తయ్యే వరకు పూర్తి బాధ్యత నాదే. ఆ చిన్నారులు భవిష్యత్తులో గొప్పగా రాణించేలా చేద్దాం” అని పోస్ట్ చేశారు. తమన్ చేసిన ఈ సాయానికి నెటిజన్లు, సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు సామాజిక సేవలో ముందుంటూనే, మరోవైపు సంగీత దర్శకుడిగా తమన్ మోస్ట్ బిజీ షెడ్యూల్‌తో దూసుకుపోతున్నారు.
Bro @Mbramesh_4005
The School Fees Has Been Paid
Pls inform their parents Tat I will take Care of their Entire Schooling Fees Until they pass outLet the children
Shine
pic.twitter.com/fLZZpv3Ddr
— thaman S (@MusicThaman) June 19, 2026




Shine